VINAYAKA FESTIVAL AT SRI KAPILESWARA SWAMY TEMPLE ON SEP 2_ సెప్టెంబరు 2వ తేదీ శ్రీకపిలేశ్వరాలయంలో వినాయక చవితి

Tirupati, 31 Aug. 19: TTD proposes to organise Vinayak chavati festivities in a grand manner at the Sri Kapileswara temple on September 2.

Besides special pujas in the morning, the Vinayak utsava idol will ride on Mushika vahanam in the evening.

The artists of TTD cultural wings- HDPP and Annamacharya Project will render Bhakti sangeet, bhajans and kolatas at the temple on that day.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబరు 2వ తేదీ శ్రీకపిలేశ్వరాలయంలో వినాయక చవితి

తిరుపతి, 2019 ఆగస్టు 31: శ్రీ కపిలేశ్వరాలయంలో సెప్టెంబరు 2వ తేదీ సోమ‌వారం వినాయక చవితి ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి.

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం, అర్చన నిర్వహించనున్నారు. సాయంత్రం 6.00 నుండి 9.00 గంటల వరకు శ్రీ వినాయకస్వామివారు మూషికవాహనంపై ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

ఈ సందర్భంగా ఈ రెండు రోజుల్లో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.