INCIDENT FREE BRAHMOTSAVAMS IS OUR MOTTO-EO_ శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌కు ప‌టిష్టంగా ఏర్పాట్లు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

Tirumala, 31 Aug. 19: Elaborate arrangements are underway for the mega religious event of annual brahmotsavams of Srivaru at Tirumala which are scheduled from September 30 to October 8, said TTD EO Sri Anil Kumar Singhal Kumar.

After a high level review meeting along with the District Collector Sri Bharat Narayan Gupta and Tirupati Urban SP Sri Anburajan, Special Officer Sri AV Dharma Reddy and CVSO Sri Gopinath Jatti and other senior officers of TTD which held at Annamaiah Bhavan in Tirumala on Saturday, the EO briefed media on the arrangements in place for annual brahmotsavams.

He said Koil Alwar Tirumanjanam will be conducted on September 24 and Ankurarpanam on September 29. The other important days includes Dhwajarohanam (5.23pm to 6pm in Meena Lagnam) on September 30, Garuda Seva (7pm till 12 midnight)on October 4, Swarna Ratham(4pm-6pm)on October 5, Rathotsavam (7am)on October 7 and Chakrasnanam on October 8.

He said Rs.7.53crores have been sanctioned to take up Engineering works including civil and electrical both at Tirumala and Tirupati in view of annual brahmotsavams. About 37 LED screens will be installed which includes 21 in Four Mada streets, 13 out side temple and 3 in Tirupati. We already have 306 urinals in the galleries of four mada streets and another180 mobile urinals will be arranged for the occasion. An additional parking area will be created at Outer Ring Road and also at SPT area this year to hold nearly 8500 vehicles.

The hill town will be under the surveillance of 1500 CC cameras and 1200 TTD vigilance staff apart from 4200 police, 3500 Srivari Seva volunteers and 1500 Scouts and Guides, 200 additional staff of TTD at different galleries to render service to the scores of visiting pilgrims.

On the sanitation front, 1088 sanitary workers will be deployed with additional manpower of 665 on Garuda Seva day. While 2 medical centers, 6 dispensaries, 11 PHCs, 45 doctors, 95 paramedical staff and 12 Ambulanceswill be exclusively deployed by the Medical Department.

Apart from TTD, the District Collector has also assured to provide the assistance from the district side by deploying expert doctors and paramedical staff for brahmotsavams, EO added.

The APSRTC is set to operate 2200 round (Up and Down) trips daily during Brahmotsavams to transport 1.5 lakh devotees while on Garuda Sevaday, they will ply 3000 round trips and transport nearly 2 lakh devotees.

Elaborating on the cultural programmes, the EO said, nearly 25-30 teams with 400-500 artistes will participate in cultural programs during theannual brahmotsavams. Teams from AP, Telangana, Tamil Nadu, Karnataka, Kerala, Pondicherry, Odisha, West Bengal, Himachal Pradesh and Gujarat have already given their consent while negotiations are going on with
few more states, he maintained.

At Kalyana vedika, the exhibition will be set up by the Garden, PR (Photography) and Musuem wings of TTD to attract millions of pilgrims during these days. About 40 tonnes of 12 varieties of flowers will be used for floral decorations in side temple, vahanams, outside and at expo all in the form of donations, he said.

Like in previous years, Arjita sevas, privileged darshans will be cancelled from September 28-October 10 in view of Brahmotsavams. Similarly, the special darshan for elders, physically challenged persons and parents with infants are also cancelled. All privileges to donors remain suspended during the period. In view of Garuda Seva on October 4, no cottages will be allotted even to self donors from October 2 to 4, the EO maintained.

Later the District Collector, SP also stated that co-operation will be extended from their side towards the smooth conduct of annual brahmotsavams.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌కు ప‌టిష్టంగా ఏర్పాట్లు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

తిరుమల, 2019 ఆగ‌స్టు 31: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో సెప్టెంబ‌రు 30 నుండి అక్టోబ‌రు 8వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌కు విచ్చేసే భ‌క్తులు శ్రీ‌వారి మూల‌మూర్తి ద‌ర్శ‌నంతోపాటు సంతృప్తిక‌రంగా వాహ‌న‌సేవ‌లు తిల‌కించేందుకు వీలుగా ప‌టిష్టంగా ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ వెల్ల‌డించారు. బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌పై జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ భ‌ర‌త్ నారాయ‌ణ గుప్తా, టిటిడి ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్ జెట్టి, తిరుప‌తి అర్బ‌న్ ఎస్పీ శ్రీ అన్బురాజ‌న్‌తో క‌లిసి శ‌నివారం తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో వివిధ విభాగాల అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగంతో స‌మ‌న్వ‌యం చేసుకుని బ్ర‌హ్మోత్స‌వాల‌ను వైభ‌వంగా నిర్వ‌హిస్తామ‌న్నారు. సెప్టెంబరు 24న కోయిల్‌ ఆళ్వార్ తిరుమంజనం, సెప్టెంబరు 29న అంకురార్పణం జరుగనున్నాయ‌ని తెలిపారు. సెప్టెంబ‌రు 30న సాయంత్రం 5.23 నుండి 6 గంట‌ల మ‌ధ్య మీన ల‌గ్నంలో ధ్వ‌జారోహ‌ణం జ‌రుగ‌నుంద‌ని, ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ముఖ్య‌మంత్రివ‌ర్యులు గౌ.. శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి శ్రీ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తార‌ని వివ‌రించారు. అక్టోబ‌రు 4న గరుడ వాహనం, అక్టోబ‌రు 5న స్వర్ణరథం, అక్టోబ‌రు 7న రథోత్సవం, అక్టోబ‌రు 8న చక్రస్నానం జ‌రుగుతాయ‌ని తెలియ‌జేశారు.

బ్ర‌హ్మోత్స‌వాల కోసం రూ.7.53 కోట్లతో తిరుమల, తిరుపతిలో ఇంజినీరింగ్‌ పనులు చేపట్టిన‌ట్టు ఈవో తెలిపారు. సెప్టెంబ‌రు 20లోపు ఇంజినీరింగ్ ప‌నులు పూర్తి చేస్తామ‌న్నారు. 4200 మంది పోలీసులు, దాదాపు 1200 మంది టిటిడి నిఘా మరియు భద్రతా సిబ్బందితో ప‌టిష్టంగా భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేప‌డ‌తామ‌న్నారు. 1330 సిసి కెమెరాల‌తో ఆల‌య మాడ వీధులు, ఇత‌ర ప్రాంతాల్లో భ‌ద్ర‌త‌ను పూర్తిస్థాయిలో క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌ నుండి ప‌ర్య‌వేక్షిస్తామ‌ని తెలిపారు. తిరుమ‌ల‌లో 8,300 వాహ‌నాల‌కు స‌రిప‌డా పార్కింగ్ వ‌స‌తి ఉంద‌ని, తిరుప‌తిలో 5 వేల ద్విచ‌క్ర వాహ‌నాలు, ఇత‌ర వాహ‌నాల‌కు పార్కింగ్ ఏర్పాట్లు చేప‌డ‌తామ‌ని చెప్పారు. భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు 300 మంది సీనియ‌ర్ అధికారులు, 3,500 మంది శ్రీవారి సేవకులు, 1500 మంది ఎన్‌సిసి, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్ అందుబాటులో ఉంటార‌ని తెలిపారు. త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో ఉద‌యం 8 గంట‌ల నుండి రాత్రి 11.30 గంట‌ల వ‌ర‌కు అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ ఉంటుంద‌ని, గ‌రుడ సేవ నాడు రాత్రి 1 గంట వ‌ర‌కు భ‌క్తుల‌ను అనుమ‌తిస్తామ‌ని వివ‌రించారు.

బ్ర‌హ్మోత్స‌వాల రోజుల్లో 24 గంట‌ల పాటు ఘాట్ రోడ్లు తెరిచి ఉంటాయ‌ని, వాహ‌నాలు మ‌ర‌మ్మతుల‌కు గురైతే వెంట‌నే చేరుకునేందుకు వీలుగా 4 క్రేన్లు, 4 ఆటోక్లినిక్‌లను అందుబాటులో ఉంచుతామ‌ని ఈవో తెలిపారు. ప్ర‌స్తుతం ఉన్న మ‌రుగుదొడ్ల‌తోపాటు 106 తాత్కాలిక మ‌రుగుదొడ్లు ఏర్పాటుచేస్తామ‌న్నారు. వాహ‌న‌సేవ‌ల్లో ఆవిష్క‌రించేందుకు 13 పుస్త‌కాలు సిద్ధంగా ఉన్నాయ‌ని, భ‌క్తుల‌కు గోవింద‌నామాలు, విష్ణుస‌హ‌స్ర‌నామాలు త‌దిత‌ర పుస్త‌క ప్ర‌సాదాన్ని ఉచితంగా పంపిణీ చేస్తామ‌ని తెలిపారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, ఒడిశా, గుజరాత్‌, పశ్చిమబెంగాళ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ నుండి కళాబృందాలు రానున్నాయ‌ని చెప్పారు. హర్యానా, మణిపూర్‌, ఛత్తీస్‌ఘడ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల అధికారులతో సంప్రదింపులు జరుగుతున్నాయ‌న్నారు. మొత్తం 1088 మంది సిబ్బందితో పారిశుద్ధ్య నిర్వహణ చేప‌డ‌తామ‌ని, బ్ర‌హ్మోత్స‌వాల రోజుల్లో అద‌నంగా 510 మంది, గరుడసేవ నాడు అదనంగా మరో 655 మందితో పారిశుద్ధ్య ఏర్పాట్లు చేప‌డ‌తామ‌న్నారు. 2 వైద్యకేంద్రాలు, 6 డిస్పెన్సరీలు, 11 ప్రథమ చికిత్స కేంద్రాలు, ఒక మొబైల్‌ క్లినిక్‌, 45 మంది వైద్యులు, 60 మంది పారామెడికల్‌ సిబ్బంది, 12 అంబులెన్సులతో వైద్య‌సేవ‌లందిస్తామ‌న్నారు. .

వాహనసేవలు తిలకించేందుకు మొత్తం 37 డిస్‌ప్లే స్క్రీన్లు ఏర్పాటుచేస్తామ‌ని ఈవో తెలిపారు. రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌ ద్వారా తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో భక్తులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తామ‌న్నారు. ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సుల ద్వారా బ్రహ్మోత్సవాల రోజుల్లో రోజుకు 2200 రౌండ్‌ ట్రిప్పులు, గరుడ సేవ నాడు 3 వేల రౌండ్‌ ట్రిప్పుల ద్వారా భ‌క్తుల‌ను త‌ర‌లిస్తామ‌న్నారు. శ్రీవారి ఆలయం, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో 36 నుండి 40 టన్నుల పుష్పాలతో అలంకరణలు చేప‌డ‌తామ‌న్నారు. పాపవినాశం రోడ్డు కల్యాణవేదిక వద్ద భ‌క్తుల‌ను ఆక‌ట్టుకునేలా ఫలపుష్ప, ఫొటో, మ్యూజియం ఎగ్జిబిషన్లు ఏర్పాటుచేస్తామ‌ని తెలిపారు. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ ద్వారా వాహనసేవలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామ‌ని ఈవో తెలిపారు. మీడియాకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు రాంభగీచా వద్ద మీడియాసెంటర్‌ ఏర్పాటు చేస్తామ‌న్నారు.

ఆర్జితసేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు

బ్రహ్మోత్సవాల్లో అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్జితసేవలు రద్దు చేసిన‌ట్టు ఈవో తెలిపారు. సెప్టెంబరు 29(అంకురార్పణం) నుండి అక్టోబరు 8వ తేదీ వరకు వయోవృద్ధులు, దివ్యాంగులు, ఒక సంవత్సరంలోపు చిన్నపిల్లల తల్లిదండ్రులకు కల్పిస్తున్న ప్రత్యేక దర్శనాల రద్దు చేశామ‌న్నారు. సెప్టెంబరు 28 నుండి అక్టోబరు 10వ తేదీ వరకు టిటిడిలోని వివిధ ట్రస్టులకు, పథకాలకు విరాళాలు అందించిన దాతలకు కల్పించే ప్రత్యేక దర్శనాలు, వారికి కేటాయించే గదులను రద్దు చేసిన‌ట్టు చెప్పారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో స్వయంగా వచ్చే కాటేజి దాతలకు మాత్రమే గదులు కేటాయిస్తామ‌ని, అక్టోబరు 4న గరుడసేవ సందర్భంగా భక్తుల రద్దీని ద ష్టిలో ఉంచుకుని అక్టోబరు 2 నుండి 4వ తేదీ వరకు కాటేజి దాతలకు ఎలాంటి గదుల కేటాయింపు ఉండదని తెలిపారు.

బ్ర‌హ్మోత్స‌వాల విజ‌య‌వంతానికి ప‌క్కా ప్ర‌ణాళిక‌లు : టిటిడి ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు ప‌క్కాగా ప్ర‌ణాళిక‌లు రూపొందించామ‌ని టిటిడి ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. శ్రీ‌వారి ఆశీస్సుల‌తో దివ్యంగా ఈ ఉత్స‌వాలు జ‌ర‌గాల‌ని ఆకాంక్షించారు. అనంత‌రం టిటిడి ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ సుంద‌ర‌వ‌ద‌నాచార్యులు వేదాశీర్వ‌చ‌నం అందించారు.

జిల్లా యంత్రాంగం సంపూర్ణ స‌హ‌కారం : జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ భ‌ర‌త్ నారాయ‌ణ గుప్తా

బ్రహ్మోత్సవాల‌కు విచ్చేసే భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా జిల్లా యంత్రాంగం నుండి పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌ని, అధికారుల‌ను డెప్యూటేష‌న్‌పై పంపుతామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ భ‌ర‌త్ నారాయ‌ణ గుప్తా తెలిపారు. ఆహారం, తాగునీటిని ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామని, ఎన్‌డిఆర్ఎఫ్, అగ్నిమాప‌క సిబ్బందిని, డాక్ట‌ర్ల‌ను పంపుతామ‌ని, అంబులెన్సులు, ఫైరింజ‌న్ల‌ను అందుబాటులో ఉంచుతామ‌ని వివ‌రించారు.

ప్ర‌ణాళికాబ‌ద్ధంగా బందోబ‌స్తు : తిరుప‌తి అర్బ‌న్ ఎస్పీ శ్రీ అన్బురాజ‌న్‌

బ్ర‌హ్మోత్స‌వాల‌కు విచ్చేసే భ‌క్తుల‌కు ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ప‌టిష్ట‌మైన బందోబ‌స్తు ఏర్పాటుచేస్తామ‌ని తిరుప‌తి అర్బ‌న్ ఎస్పీ శ్రీ అన్బురాజ‌న్ తెలిపారు. క్రైమ్‌, ట్రాఫిక్ విభాగాల‌పై ప్ర‌త్యేక‌దృష్టి పెడ‌తామ‌న్నారు. నూత‌న ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను సెప్టెంబ‌రు 15 నుండి అమ‌లు చేస్తామ‌న్నారు. చిన్న‌పిల్ల‌లు త‌ప్పిపోకుండా చైల్డ్ ట్యాగ్స్ వేస్తామ‌న్నారు.

ఈ స‌మావేశంలో టిటిడి అద‌న‌పు సివిఎస్‌వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రామ‌చంద్రారెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు, పోలీసు అధికారులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.