VINAYAKA VANAM LURES DEVOTEES AT ALIPERI_ వినాయకుడికి ”వనమాల”అలిపిరి వద్ద ఆకట్టుకుంటున్న వినాయక వనం

FOREST WING OF TTD DEVELOPS “EKAVIMSATI PATRA VANAM” AT SECOND GHAT VINAYAKA TEMPLE

Tirupati, 23 Aug. 17: With an aim to provide aesthetic feel to the multitude of devotees who visit the temple city, TTD has developed greenery both at Alipiri as well in Tiurmala by developing “Spiritual Gardens”.

The Forest Wing of TTD under the personal supervision of Deputy Conservator of Forests Sri NV Sivaram Prasad, has come out with the conceptual “Nakshatra Vanam”, “Raasi Vanam”, “Karthika Vanam”, which has been alluring the pilgrims in a big way.

Recently, the Forest Wing developed “Vinayaka Vanam” adjacent to Second Ghat Road Vinayaka Temple, near Alipiri, the Gate Way to Tirumala which is acting as the cynosure to the pilgrims.

This “Vinayaka Vanam” is conceptually developed with the 21 important types of leaves which are used while performing Ganesh Puja on the festival of Ganesha Chaturdi. Those include:

Sl.No Sanskrit name Botanical name Telugu

1 APAMARGA PATRAM Achyranthes aspera Uttareni
2 ARJUNA PATRAM Terminalia arjuna Tella maddi
3 ARKA PATRAM/
ARRARA PATRAM Calotropis procera Tella Jilledu
4 ASWATHA PATRAM Ficus religiosa Raavi
5 BADARI PATRAM Zizyphus jujuba Regu
6 BILVA PATRAM Aegle marmelos Maredu
7 BRUHATEE PATRAM Solanum indicum Vankudu
8 CHOOTHA PATRAM Mangifera indica Mamidi
9 DADIMEE PATRAM Punica granatum Danimma
10 DATOORA PATRAM Datura metel Ummetha
11 DEVADARU PATRAM Cedrus deodora Devadaru
12 DOORVAARA PATRAM Cynodon dactylon Garika gaddi
13 AARE PATRAM Bauhinia purpurea devakanchanam
14 JAJI PATRAM Jasminum grandiflorum Jaji
15 KARAVEERA PATRAM Nerium indicum Ganneru
16 MACHEEPATRAM Artemesia vulgaris Macha patri
17 MARUVAKA PATRAM Origanum vulgare Maruvam
18 SAMEE PATRAM Prosopis cineraria Jammi
19 SINDHUVARU PATRAM/
SINDHUDHARA PATRAM Vitex negundo Vavili
20 THULASI Ocimum sanctum Tulasi
21 VISHNUKRANTHA PATRAM Evolvulus alsinoides Vishnukrantha

The Vinayaka Vanam or Ekavimsati Patri Vanam was developed in a 300 Sq.metre area, enhancing the beauty of green cover of Sesha Chala Ranges.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

వినాయకుడికి ”వనమాల”అలిపిరి వద్ద ఆకట్టుకుంటున్న వినాయక వనం

300 చ.మీ విస్తీర్ణంలో 21 పవిత్ర మొక్కలు

ఆగస్టు 23, తిరుమల, 2017: తిరుమల, తిరుపతిలో పచ్చదనం పెంచి భక్తులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు టిటిడి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అటవీ విభాగం ఆధ్వర్యంలో తిరుమలలో శ్రీగంధం, ఎర్రచందనం, ఔషధ మొక్కలతోపాటు భక్తులు పవిత్రంగా భావించే దేవతామొక్కలను పెంచుతున్నారు. ఇప్పటికే రాశివనం, నక్షత్రవనం, కార్తీకవనాలను అభివృద్ధి చేశామని, తాజాగా వినాయక వనాన్ని తీర్చిదిద్దామని డిఎఫ్‌వో శ్రీ శివరామ్‌ప్రసాద్‌ తెలిపారు.

అలిపిరి రెండో ఘాట్‌లోని శ్రీ వినాయకస్వామివారి ఆలయం చెంత 300 చ.మీ విస్తీర్ణంలో వినాయక వనాన్ని పెంచారు. ఇందులో వినాయక పూజ కోసం వినియోగించే వివిధ ఫలాల మొక్కలు, పత్రాలు ఉన్నాయి. తిరుమలకు వాహనాల్లో వెళ్లే భక్తులు ఇక్కడ ఆగి వినాయకుడిని దర్శించుకుని, వినాయకవనాన్ని తిలకించి వెళుతున్నారు. ఆగస్టు 25న వినాయక చవితి సందర్భంగా వినాయక వనం గురించిన విశేషాలు, మొక్కల సంస్కృత, శాస్త్రీయ, తెలుగునామాలు ఇలా ఉన్నాయి.

సంస్కృత నామం శాస్త్రీయ నామం తెలుగు పేరు

1. అపమార్గపత్రం అచిరాంతస్‌ ఆస్పెరా ఉత్తరేణి

2. అర్జునపత్రం టెర్మినేలియ అర్జున తెల్లమద్ది

3. అర్కపత్రం కాలోట్రోపిస్‌ ప్రోసెరా తెల్లజిల్లేడు

4. అశ్వత్తపత్రం ఫైకస్‌ రెలిజియోస రావి

5. బదరీపత్రం జిజిఫస్‌ జుజుబ రేగు

6. బిల్వపత్రం ఏజిల్‌ మార్మలెస్‌ మారేడు

7. బృహతీపత్రం సోలనం ఇండికమ్‌ వంకుడు

8. చూతపత్రం మాంగిఫెరా ఇండిక మామిడి

9. దడిమీపత్రం పునిక గ్రణతం దానిమ్మ

10. దతూరపత్రం దతూర మెటల్‌ ఉమ్మెత్త

11. దేవదారుపత్రం సిడ్రస్‌ డిమోడొర దేవదారు

12. దూర్వార పత్రం సైనోడన్‌ డక్టిలాన్‌ గరిక గడ్డి

13. ఆరె పత్రం బాహినియ పర్పేరియ దేవకాంచనం

14. జాజి పత్రం జాస్మినం గ్రాండిపోరమ్‌ జాజి

15. కరవీరపత్రం నేరియం ఇండికమ్‌ గన్నేరు

16. మచీపత్రం ఆర్టిమీసియా వల్గేరిస్‌ మాచపత్రి

17. మరువాక పత్రం ఒరిగానం వల్గరే మరువం

18. శమీ పత్రం ప్రొసోపిస్‌ సినెరారియ జమ్మి

19. సింధుధార పత్రం విటెక్స్‌ నిగుండో వావిలి

20. తులసి ఓసిమమ్‌ శాంక్టమ్‌ తులసి

21. విష్ణుక్రాంతపత్రం ఎవోల్వులస్‌ ఆల్సినోసిడిస్‌ విష్ణుక్రాంత

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.