VIP DARSHAN ONLY TO PROTOCOL VIPs_ వేసవి రద్దీ కారణంగా వారాంతంలో దాతలకు బ్రేక్‌ దర్శనం రద్దు

Tirumala, 19 April 2018: In view of summer rush, TTD has limited VIP darshan to only protocol VIPs during the week ends for the next 15 weeks starting from April 20 onwards. No VIP recommendation letters will be entertained even from donors during the above said period.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

వేసవి రద్దీ కారణంగా వారాంతంలో దాతలకు బ్రేక్‌ దర్శనం రద్దు

ఏప్రిల్‌ 19, తిరుమల 2018: వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్‌ 20 నుండి జులై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో విఐపి బ్రేక్‌ దర్శనాలను ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేశామని, దాతలకు రద్దు చేశామని టిటిడి గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

దాతల నుండి సిఫారసు లేఖలు స్వీకరించబడవని తెలియజేసింది. సామాన్య భక్తుల సౌకర్యార్థం వారపు రోజుల్లోనూ బ్రేక్‌ దర్శనాల సంఖ్యను టిటిడి తగ్గించింది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.