VENGAMAMBA JAYANTHI POSTERS RELEASED_ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 288వ జయంతి ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ

Tirupati, 19 April 2018: The 288th Jayanthi posters of Matrusri Tarigonda Vengamamba was released by Tirupati JEO Sri P Bhaskar on Thursday evening in his chambers in TTD administrative building.

Speaking on this occasion he said, the birth anniversary will be observed at Tarigonda, Tirupati and Tirumala on 27th and 28th April in a befitting manner.

Annamacharya Project Director Sri Dhanajeyulu was also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 288వ జయంతి ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ

తిరుపతి, 2018 ఏప్రిల్ 19: శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలు, భక్తకవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 288వ జయంతి ఉత్సవాల పోస్టర్లను టిటిడి తిరుపతి జెఈఓ శ్రీ పోల భాస్కర్ గురువారం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ వెంగమాంబ జయంతి ఉత్సవాలను ఏప్రిల్ 27, 28వ తేదీల్లో వెంగమాంబ స్వస్థలమైన తరిగొండ, తిరుమల, తిరుపతి దివ్యక్షేత్రాలలో వైభవంగా నిర్వహించనున్నట్టు తెలిపారు.

తరిగొండలో..

తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 27, 28వ తేదీల్లో ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం, ఉదయం 9.30 గంటలకు ఆలయ ప్రాంగణంలోని తరిగొండ వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 నుండి తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి.

తిరుపతిలో..

ఏప్రిల్ 27వ తేదీ ఉదయం 10.30 గంటలకు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సు జరుగనుంది. ఇందులో ప్రముఖ పండితులు పాల్గొని వెంగమాంబ రచనలపై ఉపన్యసిస్తారు. ఏప్రిల్ 27, 28వ తేదీల్లో సాయంత్రం 6.00 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తిరుమలలో..

ఏప్రిల్ 28వ తేదీన సాయంత్రం 6.00 నుంచి 8.00 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానంలోని శ్రీ పద్మావతి పరిణయోత్సవ మండపానికి ఊరేగింపుగా వేంచేపు చేస్తారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు తరిగొండ వెంగమాంబ సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహిస్తారు.

గోడపత్రికల ఆవిష్కరణ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీ ధనంజయ పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.