VIRTUAL KALYANOTSAVAM COMMENCED IN SRINIVASA MANGAPURAM _ శ్రీనివాసమంగాపురంలో వర్చువల్ కల్యాణోత్సవం
Tirupati, 5 Feb. 22: After the successful implementation of virtual sevas in Tirumala and at Tiruchanoor temples, TTD has commenced virtual Kalyanotsavam in Srinivasa Mangapuram on Saturday on the auspicious occasion of Vasanta Panchami.
The other important days holding virtual Kalyanotsavams includes Bheeshma Ekadasi on February 12, Telugu Ugadi on April 2, Chaitra Pournami on April 16, Shravana nakshatra on May 21, Dwadasi on June 11, again Shravana star on June 18, Dwadasi on June 25, Rohini on August 20, Pournami on September 10 and October 22, Dwadasi on November 5.
The devotees who booked these virtual tickets in Sri Kalyana Venkateswara Swamy temple watched the live Kalyanam on SVBC.
According to temple DyEO Smt Shanti the response for virtual kalyanam is good. The price of the virtual Kalyanotsavam ticket is Rs.500. The devotees shall avail darshan for two members on one ticket within three months time at Sri Kalyana Venkateswara Swamy temple in Srinivasa Mangapuram. They will be also presented with a uttariyam and a blouse piece along with Akshatas as blessings from the presiding deity, she added.
Temple Archaka Sri Balaji Rangacharyulu, Superintendent Sri Ramanaiah were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీనివాసమంగాపురంలో వర్చువల్ కల్యాణోత్సవం
తిరుపతి, 2022 ఫిబ్రవరి 05: వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం వర్చువల్ కల్యాణోత్సవ సేవ నిర్వహించారు. ఆలయంలో విశేషమైన రోజుల్లో వర్చువల్ కల్యాణోత్సవం నిర్వహించాలని ఇటీవల టిటిడి నిర్ణయించింది.
విశేషమైన వసంత పంచమినాడు ఈ సేవ ప్రారంభమైంది. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ కల్యాణోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఆన్‌లైన్‌లో సేవా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు ఎస్వీబీసీలో వీక్షిస్తూ తమ ఇళ్ల నుండి సంకల్పం, గోత్రనామాలు చెప్పుకుని వర్చువల్ పద్ధతిలో కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. సేవలో పాల్గొన్నవారిని మూడు నెలలలోపు స్వామివారి దర్శనానికి ఉచితంగా అనుమతిస్తారు. ఆ సమయంలో ఉత్తరీయం, రవిక, అక్షింతలు బహుమానంగా అందిస్తారు.
అదేవిధంగా, ఫిబ్రవరి 12న ఏకాదశి, ఏప్రిల్ 2న ఉగాది, ఏప్రిల్ 16న చైత్ర పౌర్ణిమ, మే 21న శ్రవణా నక్షత్రం సందర్భంగా ఈ సేవ నిర్వహిస్తారు. అలాగే, జూన్ 11న ద్వాదశి, జూన్ 18న శ్రవణా నక్షత్రం, జూన్ 25న ద్వాదశి, ఆగస్టు 20న రోహిణీ నక్షత్రం, సెప్టెంబరు 10న పౌర్ణమి, అక్టోబరు 22న, నవంబరు 5న ద్వాదశి సందర్భంగా వర్చువల్ కల్యాణోత్సవం సేవ జరుగనుంది.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, సూపరింటెండెంట్ శ్రీ రమణయ్య, అర్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.