VISESHA HOMA MAHOTSAVAMS _ శ్రీ కపిలేశ్వరాలయంలో విశేష‌పూజ హోమ మ‌హోత్స‌వాలు ప్రారంభం

TIRUPATI, 26 OCTOBER 2022: Visesha Homa Mahotsavams commenced in Sri Kapileswara Swamy temple on Wednesday with Ganapathi Homam.

On October 27 also Ganapathi Homam will last. From October 28 till October 30 Sri Subramanyam Swamy Homam will be observed.

On October 31 Sri Dakshinamurty Homam, November 1 Sri Kalabhairava Homam, November 2 Navagraha Homam, November 3 to 11 Sri Kamakshi Ammavaru Homam, November 12-22 Sri Kapileswara Swamy Homam, same day Sri Siva Parvati Kalyanam, On November 23 Sri Chandikeswara Homam, Trisula Snanam and Pancharadhana will be performed.

The Grihastha devotees shall pay Rs. 500 on which two persons shall be allowed.

DyEO Sri Devendrababu, AEO Sri Srinivasulu, Superintendent Sri Bhupati and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో విశేష‌పూజ హోమ మ‌హోత్స‌వాలు ప్రారంభం

తిరుపతి, 2022 అక్టోబ‌రు 26: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో బుధ‌వారం గణపతి హోమంతో విశేషపూజహోమ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. గణపతి హోమం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలగుతాయని అర్చకులు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ఉద‌యం పంచ‌మూర్తుల‌కు పాలు, పెరుగు, తేనె, చంద‌నం, విభూదితో విశేషంగా స్న‌ప‌న‌తిరుమంజ‌నం నిర్వ‌హించారు. సాయంత్రం గ‌ణ‌ప‌తిపూజ‌, పుణ్య‌హ‌వ‌చ‌నం, వాస్తుపూజ‌, ప‌ర్య‌గ్నిక‌ర‌ణం, మృత్సంగ్ర‌హ‌ణం, అంకురార్ప‌ణ‌, క‌ల‌శ‌స్థాప‌న‌, అగ్నిప్ర‌తిష్ఠ‌, గ‌ణ‌ప‌తి హోమం, ల‌ఘుపూర్ణాహుతి నిర్వ‌హించ‌నున్నారు. అక్టోబ‌రు 27వ తేదీ కూడా గణపతి హోమం జరుగనుంది.

అక్టోబ‌రు 28వ తేదీ నుంచి శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం :

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబ‌రు 28 నుండి 30వ తేదీ వ‌ర‌కు శ్రీసుబ్రమణ్య స్వామివారి హోమం మూడు రోజుల పాటు ఘనంగా జరుగనుంది. అక్టోబ‌రు 30న సాయంత్రం 5.30 గంట‌ల‌కు శ్రీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామివారి క‌ల్యాణం నిర్వ‌హిస్తారు.

కాగా, అక్టోబరు 31న శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం, న‌వంబరు 1న శ్రీ కాలభైరవ స్వామివారి హోమం, న‌వంబ‌రు 2న శ్రీ నవగ్రహ హోమం, న‌వంబరు 3 నుంచి 11వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి హోమం (చండీయాగం), నవంబరు 12 నుంచి 22వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి హోమం(రుద్రయాగం), న‌వంబరు 22న శ్రీ శివ‌పార్వ‌తుల క‌ల్యాణం చేప‌డ‌తారు. న‌వంబ‌రు 23న శ్రీ చండికేశ్వ‌ర‌స్వామివారి హోమం, త్రిశూలస్నానం, పంచ‌మూర్తుల ఆరాధ‌న‌ నిర్వహిస్తారు.

గృహస్తులు రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు. పవిత్రమైన కపిలతీర్థంలోని శ్రీకపిలేశ్వరస్వామివారి క్షేత్రంలో హోమాల్లో పాల్గొన‌డం ఎంతో పుణ్యఫలమని అర్చకులు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర‌బాబు, ఏఈవో శ్రీ శ్రీ‌నివాసులు, సూప‌రింటెండెంట్లు శ్రీ భూప‌తి, శ్రీ శ్రీ‌నివాసులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ బాల‌క్రిష్ణ‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.