VISESHA PUJA HOMA MAHOTSAVAMS AT SRI KAPILESWARA SWAMY TEMPLE FROM OCTOBER 20 TO NOV 18_ అక్టోబరు 20 నుంచి నవంబరు 18వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరాలయంలో విశేషపూజ హోమ మహోత్సవాలు

Tirupati, 10 Oct. 17: TTD plans to perform Viseshapuja Homa Mahotsavams at Sri Kapileswara temple from October 20-Nov.18 as part of festivities during holy Karthika Masam.

Beginning with the Ankurarpanam on October 20th, TTD is organizing Sri Ganapathi Homam onOct.21-23, Sri Subramanya Homam on Oct.-24-25, Kalyanotsavam on Oct.20 and Sri Dakshinamurti Homam on Oct 28 at the temple.

Similarly Sri Navagraha homam on Oct.27th, Sri Kamakshi homam (chandi homam) from Oct.28- Nov 5 , Sri Kapileswara Homam (rudra homam) from Nov.6-16 Sri Kalabhairava homam on Nov.17, Sri Chandikeswara Homam ,Trishula snanam, Tiru veedhi utsavam of Panchamurthis will be organised by the TTD.

Interested devotees could participate in traditional dress only with payment of Rs.500 and beget one uttariyam, one blouse and anna prasadam with Lords blessings.

The cultural wings of TTD -H D P P, Annamacharya project plan to organise cultural activities like Harikatha kalakshepam, bhakti music and devotional activities.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

అక్టోబరు 20 నుంచి నవంబరు 18వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరాలయంలో విశేషపూజ హోమ మహోత్సవాలు

అక్టోబరు 10, తిరుపతి, 2017: పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 20 నుంచి నవంబరు 18వ తేదీ వరకు విశేషపూజ హోమ మహోత్సవాలు జరుగనున్నాయి.

అక్టోబరు 20న అంకురార్పణం, అక్టోబరు 21 నుంచి 23వ తేదీ వరకు శ్రీగణపతిస్వామివారి హోమం, అక్టోబరు 24, 25వ తేదీల్లో శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం, అక్టోబరు 25న కల్యాణోత్సవం, అక్టోబరు 26న శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం నిర్వహిస్తారు.

అదేవిధంగా, అక్టోబరు 27న శ్రీ నవగ్రహ హోమం, అక్టోబరు 28 నుంచి నవంబరు 5 వరకు శ్రీ కామాక్షి అమ్మవారి హోమం(చండీహోమం), నవంబరు 6 నుంచి 16వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారి హోమం(రుద్రహోమం), నవంబరు 17న శ్రీ కాలభైరవ స్వామివారి హోమం, నవంబరు 18న శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం, త్రిశూలస్నానం, పంచమూర్తుల తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

కాగా, గ హస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గ హస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు. ఈ హోమాల్లో పాల్గొనే గ హస్తులు కచ్చితంగా సంప్రదాయ వస్త్రధారణలో రావాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజూ తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో హరికథా కాలక్షేపం, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.