VOCAL FETE MESMERIZES MUSIC LOVERS _ పుర ప్రజలను విశేషంగా ఆకట్టుకున్న డా.కె.వందన గాత్ర సంగీతం

TIRUPATI, 29 MAY 2024: The final day of week-long 616th Annamacharya Jayanti celebrations witnessed Smt Dr K Vandana giving a mellifluous musical performance at Annamacharya Kalamandiram on Wednesday evening.

On Vilolin Dr Komanduru Venkata Krishna

and on Mridangam Sri Kotipalle Ramesh provided extravagance to the magical voice on their percussion to the Sankeertans Vande Vasudevam, Tera Teeyaga Rada..Koluvudee Bhakti.. Nallani Meni.. and many wonderful scores of Tyagaraja and Annamacharya.

Renowned musician Sri Komanduri Seshadri, SVETA Director Sri Bhuman Subramanyam Reddy, former SKU VC Prof. Kusuma Kumari, Annamacharya Project Director Dr Vibhishana Sharma, VGO Sri Bali Reddy and music lovers of Tirupati were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

పుర ప్రజలను విశేషంగా ఆకట్టుకున్న డా.కె.వందన గాత్ర సంగీతం

తిరుపతి, 2024 మే 29: తిరుపతి ఎస్వి సంగీత నృత్య కళాశాల అధ్యాపకురాలు డా.కె.వందన స్వరాల నుండి వెలువడిన మధురమైన స్వరాలు, సంకీర్తనలతో తిరుపతి పురప్రజలు తన్మయత్వం చెందారు.

తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో అన్నమాచార్య 616వ జయంతి ఉత్సవాలలో చివరి రోజు అయిన బుధవారం సాయంత్రం శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు కీర్తనలను సుమధురంగా ఆలపించారు.

ఇందులో భాగంగా శ్రీమతి వందన బృందం ఆలపించిన ” వందే వాసుదేవం…,
తెర తీయగ రాదా…, కొలువుడీ భక్తి…, కొండల కోనేటి…, నల్లని మేని నగవు చూపుల వాడు…..” వంటి కీర్తనలు ఆహుతులను మంత్రముగ్ధులను చేశాయి.

వయోలిన్ పై డాక్టర్ కొమండూరి వెంకట కృష్ణ, మృదంగంపై శ్రీ కోటిపల్లె రమేష్ అద్భుతమైన వాయిద్య సహకారాన్ని అందించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ కొమండూరి శేషాద్రి, శ్వేత సంచాలకులు శ్రీ భూమన్ సుబ్రహ్మణ్యం రెడ్డి, అనంతపురం ఎస్.కె యూనివర్సిటీ విశ్రాంత ఉపకులపతి శ్రీమతి కుసుమ కుమారి, అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ విభీషణ శర్మ,  విజిఓ శ్రీ బాలిరెడ్డి, పెద్ద సంఖ్యలో సంగీత ప్రియులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.