NARAYANAVANAM BTU CONCLUDES _ ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
TIRUPATI, 29 MAY 2024: The annual Brahmotsavam in Sri Kalyana Venkateswara Swamy temple at Narayanavanam concluded with Dhwajavarohanam on Wednesday evening.
DyEO Smt Nagaratna, AEO Sri Parthasarathy, Superintendent Sri Dharmaiah and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2024 మే 29: నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.
రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గరుడ పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను సాగనంపారు.
బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ పార్థసారథి, సూపరింటెండెంట్ శ్రీ ధర్మయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ నాగరాజు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.