JEO INSPECTS ONGOING WORKS AT VONTIMITTA _ ఏప్రిల్‌ 13 నుండి 21వ తేదీ వరకు ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు,

Vontimitta, 27 Feb. 19: TTD JEO for Tirupati, Sri B Lakshmikantham on Wednesday, inspected Sri Kodanda Rama Swamy temple at Vontimitta in Kadapa district.

He instructed the concerned officials to complete all the works on time as the annual brahmotsavams are scheduled from April 13 to 21.

The JEO also monitored the progress of works at Kalyana Vedika, Puskarini, Alankara Mandapam and other civil works.

Speaking on this occasion, he said the important days includes Dhwajarohanam on April 13, Garuda Vahanam on April 17, Sita Rama Kalyanam on April 18, Radhotsavam on April 19, Dhwajavarohanam on April 21. After the completion of Navahnika Brahmotsavams, Pushpayagam will be performed on April 22, the JEO added.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఏప్రిల్‌ 13 నుండి 21వ తేదీ వరకు ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు,

ఏప్రిల్‌ 18న శ్రీ సీతారాముల కల్యాణం : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం

ఫిబ్రవరి 27, ఒంటిమిట్ట, 2019: కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ 13 నుండి 21వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం వెల్లడించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై బుధవారం ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఏప్రిల్‌ 13న ధ్వజారోహణం, పోతన జయంతి, ఏప్రిల్‌ 16న హనుమంత వాహనం, ఏప్రిల్‌ 18న శ్రీ సీతారాముల కల్యాణం, ఏప్రిల్‌ 19న రథోత్సవం, ఏప్రిల్‌ 21న చక్రస్నానం, ఏప్రిల్‌ 22న పుష్పయాగం జరుగనున్నాయని తెలిపారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 8 నుండి 9.30 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తామన్నారు. బ్రహ్మూెత్సవాలలోపు ఆలయంలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కల్యాణవేదికను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని, ప్రతి 15 రోజులకోసారి పనుల ప్రగతిని సమీక్షిస్తానని చెప్పారు. పురావస్తు విభాగం అధికారులతో సమన్వయం చేసుకుని ఆలయంలో చేపట్టాల్సిన చిన్న చిన్న మరమ్మతులను పూర్తి చేయాలని సూచించారు. బ్రహ్మూెత్సవాలపై ప్రచార రథాల ద్వారా జిల్లా మొత్తం ప్రచారం చేయాలన్నారు.

అనంతరం జెఈవో అధికారులతో కలిసి ఆలయ పరిసరాల్లో మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా అలంకార మండపం, ఉద్యానవనం, పుష్కరిణి, కల్యాణవేదిక వద్ద జరుగుతున్న వేదిక పనులు, మరుగుదొడ్లు, నీటి పైపులైన్‌ పనులను పరిశీలించారు. భక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేపట్టాలని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు.

ఏప్రిల్‌ 18న శ్రీ సీతారాముల కల్యాణం :

ఏప్రిల్‌ 18న శ్రీ సీతారాముల కల్యాణానికి విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని జెఈవో శ్రీబి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు వైభవంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా నిర్వహించే ఈ కల్యాణానికి ఒక లక్ష మందికిపైగా భక్తులు విచ్చేసే అవకాశముందన్నారు.

బ్రహ్మూెత్సవాల్లో వాహనసేవలు :

తేదీ ఉదయం రాత్రి

13-04-2019(శని) ధ్వజారోహణం(ఉ|| 8-9గం||ల) పోతన జయంతి, శేషవాహనం.

14-04-2019(ఆది) వేణుగాన అలంకారం హంస వాహనం

15-04-2019(సోమ) వటపత్రసాయి అలంకారం సింహ వాహనం

16-04-2019(మంగళ) నవనీతకృష్ణ అలంకారం హనుమంత వాహనం

17-04-2019(బుధ) మోహినీ అలంకారం గరుడసేవ

18-04-2019(గురు) శివధనుర్భాణ అలంకారం శ్రీ సీతారాముల కల్యాణం (రా|| 8 గం||లకు), గజవాహనం.

19-04-2019(శుక్ర) రథోత్సవం —–

20-04-2019(శని) కాళీయమర్ధన అలంకారం అశ్వవాహనం

21-04-2019(ఆది) చక్రస్నానం ధ్వజావరోహణం(రా|| 7 గం||)

22-04-2019(సోమ) ——– పుష్పయాగం(సా|| 6 గం||).

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.