MAKE FOOLPROOF ARRANGEMENTS FOR THUMBURU THEERTHA MUKKOTI- JEO SRI KS SREENIVASA RAJU_ మార్చి 20న తుంబురుతీర్థ ముక్కోటికి విస్తృత ఏర్పాట్లు : తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirumala, 27 Feb. 19: Tirumala JEO Sri KS Sreenivasa Raju directed the officials to make all the arrangements for Tumburu Thirtha Mukkoti falling on March 20 in view of anticipation of huge crowds to this most important torrent festivals.

Reviewing with the officials at Annamaiah Bhavan Tirumala, the JEO said that nearly 35000 Devotees are being expected to take part in the torrent festival and will be allowed from 6 am of March 19.
He directed Anna Prasadam officials to organise distribution of sambar rice. Curd rice, upma and Pongal packets near Papavinashanam dam. Provide water bottle, buttermilk packets also.

He said primary health care with ambulance and team of doctors should be located near the Papavinashanam dam and Thirtham along with vigilance and security for devotee convenience. He also instructed to deploy sufficient number of sevakulu to serve pilgrims.

He also instructed all departments to coordinate efforts and avert any fire accidents in the forest near Thumburu Thirtham.

SE 2 Sri Ramachandra Reddy, DyEO of Srivari Temple Sri Harindranath, DFO Sri Phani Kumar Naidu, Transport GM Sri Sesha Reddy, VSO Sri Manohar, CMO Dr Nageswar Rao, Annaprasadam OSD Sri Venugopal and other officials participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

మార్చి 20న తుంబురుతీర్థ ముక్కోటికి విస్తృత ఏర్పాట్లు : తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

ఫిబ్రవరి 27, తిరుమ‌ల‌, 2019: కార్తీక పౌర్ణ‌మి సంద‌ర్భంగా మార్చి 20వ తేదీన తిరుమలలో జరుగనున్న శ్రీ తుంబురు తీర్థ ముక్కోటికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల నుండి విశేషంగా భ‌క్తులు విచ్చేసే అవ‌కాశ‌ముంద‌ని, ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేయాల‌ని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు అధికారుల‌ను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధ‌వారం సాయంత్రం తుంబురు తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష‌ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లడుతూ తుంబురు తీర్థానికి మార్చి 19వ తేదీ ఉదయం 6 గంట‌ల‌ నుండి భక్తులను అనుమతించనున్నట్లు తెలిపారు. దాదాపు 35 వేల మంది భక్తులు వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌న్నారు. టిటిడి అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో పాప‌వినాశ‌నం డ్యామ్ వ‌ద్ద మార్చి 19, 20వ తేదీల్లో ఉప్మా, పొంగ‌ళ్‌, సాంబార‌న్నం, పెరుగన్నం ప్యాకెట్లు భక్తులకు అందించాలని ఆదేశించారు. ముందుగానే ఈమేరకు ఒక భక్తుడికి రెండు పులిహోర‌ ప్యాకెట్లు, ఒక మ‌జ్జిగ‌ ప్యాకెట్‌, వాట‌ర్ బాటిల్ అందివ్వాలని సూచించారు. పాప‌వినాశ‌నం డ్యామ్ వ‌ద్ద ప్ర‌థ‌మ చికిత్స కేంద్రం, అంబులెన్స్‌, తుంబురు తీర్థం వ‌ద్ద ఒక వైద్య‌బృందాన్ని అందుబాటులో ఉంచాల‌న్నారు. పోలీసుశాఖ, అటవీశాఖ, టిటిడి విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాపవినాశనం నుండి తుంబురు తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని వుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని విభాగాలవారు సమన్వయంతో అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జెఈవో కోరారు.

ఈ సమావేశంలో టిటిడి ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, డిఎఫ్‌వో శ్రీ ఫ‌ణికుమార్ నాయుడు, ట్రాన్స్‌పోర్టు జియం శ్రీ శేషారెడ్డి, విఎస్‌వో శ్రీ మ‌నోహ‌ర్‌, సిఎంఓ డా.. నాగేశ్వ‌ర‌రావు, అన్న‌ప్ర‌సాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్ ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.