VONTIMITTA LITERARY FETE MUSES DEVOTEES _ రామనామస్మరణతో సాగిన శ్రీరామ పాదుకా పట్టాభిషేకం కవి సమ్మేళనం
VONTIMITTA, 31 MARCH 2023: The literary fete on Sri Rama Paduka Pattabhishekam on Friday mused devotees on Friday evening at Vontimitta Kodanda Ramalayam.
On the other hand the devotional cultural programs by TTD also allured the devotees.
రామనామస్మరణతో సాగిన శ్రీరామ పాదుకా పట్టాభిషేకం కవి సమ్మేళనం
తిరుపతి, 2023 మార్చి 31: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన శ్రీరామ పాదుకాపట్టాభిషేకం కవి సమ్మేళనం రామనామస్మరణతో ఆకట్టుకునేలా సాగింది. టిటిడి ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తిరుపతికి చెందిన డా.ఇజి.హేమంత్ కుమార్ మాట్లాడుతూ రామాయణాన్ని పలువురు కవులు వారి దృష్టి కోణంతో విలక్షణంగా వర్ణించారని తెలిపారు. ఒకే సభలో ఆయా కవుల దృక్కోణాన్ని తెలుసుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు.
అనంతరం ఎల్.జగన్నాథ శాస్త్రి ‘శ్రీ గడియారం వెంకటశేష శాస్త్రి రామాయణం’, శ్రీ ఎం.మల్లికార్జునరెడ్డి ‘శ్రీ రామాయణ కల్పవృక్షం’, శ్రీ వై.మధుసూదన్ ‘శ్రీ రంగనాథ రామాయణం’, డా. సి.శివారెడ్డి ‘శ్రీమద్ వాల్మీకి రామాయణం’, శ్రీ యు.భరత్ శర్మ ‘చంపూ రామాయణం’, డా. పి.నీలవేణి ‘మొల్ల రామాయణం’ అనే అంశాలపై తమ కవితా చాతుర్యాన్ని వినిపించారు.
ఆకట్టుకున్న ధార్మిక, సంగీత కార్యక్రమాలు
టిటిడి ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఉదయం ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు మంగళధ్వని వినిపించారు. ఆ తరువాత శ్రీరంగాచార్యులు ధార్మికోపన్యాసం చేశారు. సాయంత్రం శ్రీ ఎం.బి.లోకనాథరెడ్డి బృందం భక్తిసంగీతం వీనులవిందుగా సాగింది. రాత్రి శ్రీమతి జి.మునిలక్ష్మి బృందం హరికథాగానం చేశారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.