VONTIMITTA RAMAIAH KALYANAM ON APRIL 26 _ ఏప్రిల్ 26న ఒంటిమిట్ట రామయ్య క‌ల్యాణం

 -SVBC TO LIVE TELECAST

 Vontimitta, 25 Apr. 21: The Sri Sitarama Kalyanam the grand highlight of the ongoing Sri Ramanavami Brahmotsavams, will be conducted on Monday tomorrow in ekantham due to Covid guidelines and will be live telecast by the SVBC.

The awe-inspiring celebrations awaited by the devotees across the globe will be held at the Kalyana Mandapam inside the famous Sri Kodandarama Swamy temple of Vontimetta.

TTD has appealed to devotees to witness the majestic celebrations on the SVBC channel from their homes and beget Lord’s blessings.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏప్రిల్ 26న ఒంటిమిట్ట రామయ్య క‌ల్యాణం

ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం

ఒంటిమిట్ట, 2021, ఏప్రిల్ 25: ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శ్రీ‌రామ‌న‌వ‌మి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ఏప్రిల్ 26న సోమ‌వారం శ్రీ సీతారాముల క‌ల్యాణం జరుగనుంది. ఆలయ ప్రాంగ‌ణంలోని కల్యాణ మండపంలో రాత్రి 8 నుండి 10 గంటల వరకు కల్యాణం నిర్వ‌హిస్తారు. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా స్వామివారి క‌ల్యాణం నిర్వ‌హించ‌నున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భ‌క్తులు రాముల‌వారి క‌ల్యాణాన్ని వీక్షించేందుకు వీలుగా శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ద్వారా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తారు. భక్తులు తమ ఇండ్ల నుంచే స్వామి వారి కల్యాణాన్ని వీక్షించవలసినదిగా మనవి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.