VONTIMITTA TEMPLE GEARS UP FOR ANNUAL FETE _ ఏప్రిల్ 9న ఒంటిమిట్టలో శ్రీ‌రామ‌న‌వ‌మి బ్రహ్మోత్సవాలకు అంకురార్ప‌ణ‌

DWAJAROHANAM ON APRIL 10 AND SRI SITRAMA KALYANAM ON APRIL 15

 Tirupati, 07 April 2022: TTD is organising the grand Ankurarpanam fete on April 9 evening for the annual Sri Ramanavami Brahmotsavam of Sri Kodandaramaswami temple at Vontimetta slated from April 10-18 in YSR Kadapa District.

The spectacular ceremony of Dwajarohanam will be conducted at Vrishabha lagnam between 8am and 9am and on the same day evening Potana Jayanti, Kavi Sammelanam followed by Sesha vahana Seva will be observed.

TTD is organising daily vahanas sevas cultural and dharmic programs like Harikathas, discourses, Sahiti sadassu, Sankeetans by bhajan mandalis and Kolatas in front of vahana sevas by artists of HDPP and other projects on these days.

SPECIAL PROGRAMS OF APRIL 15 (KALYANOTSAVAM)

TTD is organising various cultural programs on the occasion of Sri Sitarama Kalyanam which includes Nadaswara Vaidyam by SV College of Music and Dance students, artists of SVBC “Adivo – Alladivo” program, Nama sankeetans by Sri Vitthal Das Maharaj of Tamilnadu and special discourses by Acharya Chakravarti Ranganathan of National Sanskrit University, Dr Akella Vibhishana Sharma Director of Annamacharya project.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏప్రిల్ 9న ఒంటిమిట్టలో శ్రీ‌రామ‌న‌వ‌మి బ్రహ్మోత్సవాలకు అంకురార్ప‌ణ‌

ఏప్రిల్ 10న ధ్వ‌జారోహ‌ణం

ఏప్రిల్ 15న శ్రీ సీతారాముల క‌ల్యాణం

తిరుపతి, 2022 ఏప్రిల్ 07: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 10 నుండి 18వ తేదీ వరకు జరుగనున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఏప్రిల్ 9న శ‌నివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది.

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన నిర్వ‌హిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు అర్చకులు వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహిస్తారు.

ఏప్రిల్ 10న ధ్వజారోహణం :

ఏప్రిల్ 10న ఆదివారం ఉదయం 8 నుండి 9 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. సాయంత్రం 4 నుండి రాత్రి 7 గంటల వరకు పోతన జయంతి, కవి సమ్మేళనం, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శేష వాహనసేవ నిర్వ‌హిస్తారు. ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివ‌రాలు

తేదీ ఉదయం రాత్రి

10-04-2022(ఆది) ధ్వజారోహణం(ఉ|| 8-9గం||ల)(వృష‌భ ల‌గ్నం), పోతన జయంతి, శేషవాహనం.

11-04-2022(సోమ‌) వేణుగాన అలంకారం, హంస వాహనం.

12-04-2022(మంగ‌ళ‌) వటపత్రశాయి అలంకారం, సింహ వాహనం.

13-04-2022(బుధ‌) నవనీతకృష్ణ అలంకారం, హనుమత్సేవ‌.

14-04-2022(గురు) మోహినీ అలంకారం, గరుడసేవ.

15-04-2022(శుక్ర) శివధనుర్భంగాలంకారం, శ్రీ సీతారాముల కల్యాణం (రా|| 8 గం||లకు), గ‌జవాహనం.

16-04-2022(శ‌ని) రథోత్సవం.

17-04-2022(ఆది) కాళీయమర్ధన అలంకారం, అశ్వవాహనం.

18-04-2022(సోమ‌) చక్రస్నానం, ధ్వజావరోహణం(రా|| 7 గం||).

19-04-2022(మంగ‌ళ‌) పుష్పయాగం(సా|| 6 గం||).

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.