WALL POSTER OF SRI VEDA NARAYANA SWAMY TEMPLE,NAGAKLAPURAM BTU’s POSTER RELEASED _ నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ

Tirupati, 24 April 2018 ; Joint Executive Officer of Tirupati Sri Pola Bhaskar on Tuesday released the wall posters of the Brahmosavam of Sri Veda Narayanaswami temple, Nagulapram begining from April 26 to May 7th.

Releasing the wall posters at his chambers in the TTD Administrative building, Sri Bhaskar said the holy event will kick off with Dwajarohanam on April 29 .The sacred Garuda seva will be on May3rd, Rathotsavam on May 6th and Chakrasnanam on May 7th morning , he said.

He said the artists of the HDPP Annamacharya and Dasa Sahitya Projects of TTD will conduct harikathas, bhakti sangeet and other cultural programs including bhajans, kolatas,etc.

He appealed to devotees from all surrounding areas of the town and Tirupati to participate in the event and beget the blessings of Sri Veda Narayanaswami.

Dy EO of the TTD sub temples Smt Jhansi Rani participated in the wall poster release event.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ

ఏప్రిల్‌ 24 తిరుపతి 2018 ; తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ 26 నుండి మే 7వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలు గోడపత్రికలను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఏప్రిల్‌ 29వ తేదీన ఉదయం 9 గంటలకు ధ్వజారోహణంతో శ్రీ వేదనారాయణస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. మే 3న గరుడసేవ, మే 6న రథోత్సవం, మే 7న ఉదయం 10 గంటలకు చక్రస్నానం జరుగనున్నట్టు వివరించారు. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నట్టు తెలియజేశారు. పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి వాహనసేవలను తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.