WEDDING FESTIVITIES OF SRI RAMA COMMENES WITH HARIDHRA GHATANAM _ ఒంటిమిట్ట శ్రీరాముని కళ్యాణ మహోత్సవాలు ” హరిధ్రా ఘటనం” తో ప్రారంభం

THREE KILOS OF TURMERIC ROOTS POUNCED BY DEVOTEES

TURMERIC TO USED ON THE DAY OF SRI SITA RAMA KALYANAM

Vontimitta, 13 April 2024: The grand gala of celestial marriage festivities of Sri Sita Rama in Vontimitta commenced with the traditional ”Haridhra Ghatanam” on Saturday.

Women devotees pounced about three kilos of turmeric roots on the occasion chanting Jai Sri Ram.

Earlier the turmeric roots and the rolling stone and pouncing stone were rendered special Pujas inside Garbhalayam.

Archaka Shravana Swamy informed the significance of the event to devotees stating that the Haridhra Ghatanam marks the beginning of the celestial marriage festivities. “The turmeric will be utilised for Snapanam and preparation of Talambralu.

Pradhana Archaka Sri Raghavacharyulu, Vontimitta Special Officer Smt Prasanthi, Superintendent Sri Hanumantu, temple inspector Sri Naveen, large number of women devotees, archakas Manoj, Pavan were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఒంటిమిట్ట శ్రీరాముని కళ్యాణ మహోత్సవాలు ” హరిధ్రా ఘటనం” తో ప్రారంభం

పసుపు దంచే కార్యక్రమంలో మూడు కిలోల పసుపు వేర్లు

శ్రీ సీతా రామ కళ్యాణం తాళంబ్రాలలో పసుపు వినియోగం

వొంటిమిట్ట, 13 ఏప్రిల్ 2024: వొంటిమిట్టలోని శ్రీ సీతా రాముల కల్యాణ మహోత్సవాలు శనివారంనాడు ”హరిధ్రా ఘటనం”తో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది తొలిసారిగా టీటీడీ ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.

ఈ సందర్భంగా మహిళా భక్తులు సుమారు మూడు కిలోల పసుపును పోసి జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ సాంప్రదాయబద్దంగా రోలులో దంచారు.

అంతకుముందు గర్భాలయం లోపల పసుపు కొమ్ములకు, రోకళ్లకు స్వామి పాదాల చెంత ప్రత్యేక పూజలను అర్చక స్వాములు సశాస్త్రీయంగా చేశారు.

అర్చకులు శ్రీ శ్రవణ స్వామి మాట్లాడుతూ భగవత్ విజ్ఞాపనతో హరిధ్రా ఘటనం కార్యక్రమం ప్రారంభం అయిందని తెలిపారు. తద్వారా శ్రీ సీతా రామ కల్యాణ మహోత్సవ ఏర్పాట్లకు నాంది పలికినట్లు అయిందన్నారు. అనంతరం ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యతను భక్తులకు తెలియజేశారు. “ఇవాళ పసుపు దంచే కార్యక్రమంలో వచ్చిన పసుపును ఉత్సవరులకు కళ్యాణం నాడు నిర్వహించే స్నపనం మరియు తలంబ్రాలు తయారీకి ఉపయోగిస్తారన్నారు.

“జై శ్రీ రామ్… జై శ్రీ రామ్ అంటూ నినదిస్తూ ఈ సాంప్రదాయ పసుపు దంచే కార్యక్రమంలో మహిళా భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

అన్నమాచార్య కళాకారుల బృందం సందర్భానుసారంగా రామ భజనలను కీర్తించారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చక స్వాములు శ్రీ రాఘవాచార్యులు, ఒంటిమిట్ట ప్రత్యేక అధికారిణి శ్రీమతి ప్రశాంతి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, అర్చకులు మనోజ్, పవన్ల, ఆలయ ఇన్‌స్పెక్టర్ శ్రీ నవీన్, పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది