WIDE SPREAD HINDU DHARMA PRACHARA BY TTD COMMENCES WITH GITA JAYANTHI-CHAIRMAN _ హిందూ ధ‌ర్మ విస్తృత ప్ర‌చారానికి శంఖారావం : టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

Tirupati, 7 December 2019: The wide spread activities to protect, preserve and propagate Sanatana Hindu Dharma Prachara by TTD commences with the event of Gita Jayanthi, said TTD Trust Board Chairman Sri YV Subba Reddy. 

The Gita Jayanthi fete was held in the spacious SV High School Grounds in Tirupati on Saturday,  where in nearly 10 thousand students from various colleges of TTD participated in community Gita Parayana. 

Gracing this unique event as Chief Guest, Sri YV Subba Reddy said that Gita Jayanthi is observed as the day on which Lord Krishna taught Arjuna the importance of life by the way of 700 slokas. We want to give this essence to the next gen as the students should learn the importance of ethical life narrated by Gitacharya in Bhagavat Gita. 

So we have organized this massive programme with the collaboration of HDPP wing of TTD with ISKCON and other like minded spiritual organizations. We want to slam down the alleged false propaganda of evangelical activities in TTD by some vested interests by taking up unique spiritual Hindu Dharmic programmes on a grand scale”,  the Chairman added.

Later TTD Ex-officio member Dr C Bhaskar Reddy said that by learning Gita one could lead a pious life. 

JEO Sri P Basant Kumar appreciated the interest shown by the parents and teachers in motivating their students to learn the slokas in Bhagavat Gita.

TEMPLE CITY SIZZLES TO GITA PARAYANAM

The Temple City which woke up to an incessant rain on Saturday sizzled to the rhythmic rendition of Bhagavat Gita slokas by thousands of students.

Braving rains, the students reached the SV HS Grounds in a ralley and presented slokas with utmost devotion. 

Earlier, the program commenced with the chanting of Govinda Namas by Bhajan team of Satya Sai Seva Organisation lead by Sri Sreedhar and Sri Phanirangasai. 

GITA SHOWS THE WAY

The Pontiff of Sri Pushpagiri Mutt of YSR Kadapa district, HH Sri Vidyashankara Bharati Theertha Swamy said, Bhagavat Gita shows a human how to lead a righteous life.

“Our Hindu Sanatana Dharma has thousands of scriptures. Just by reading the verses in Bhagavat Gita is equal to mastering all scriptures and one will be free from all his sins and attains salvation”, he added.

Sri Anupamananda Maharaj, the Chief of Sri Ramakrishna Seva Samiti,  Tirupati said, awakening the inner soul in every human is possible only through Gita Parayana and this was explained by Swamy Vivekananda in the form of phrases so that the essence of Gita could easily reach a lay man also,  he maintained.

Board member Smt V Prasanthi Reddy,  Chief Audit Officer Sri Sesha Sailendra,  HDPP Chief Dr C Rajagopalan,  SVHVS Project Officer Dr A Vibhishana Sharma,  Devastanam Education Officer Dr Ramana Prasad and others were also present. 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

హిందూ ధ‌ర్మ విస్తృత ప్ర‌చారానికి శంఖారావం :టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

10 వేల మంది విద్యార్థుల‌తో సామూహిక గీతాపారాయ‌ణం

తిరుప‌తిలో ఘ‌నంగా గీతా జ‌యంతి

తిరుపతి, 2019 డిసెంబరు 07 ;హిందూ స‌నాత‌న ధ‌ర్మాన్ని మ‌రింత విస్తృతంగా ప్ర‌చారానికి చేసేందుకు ఈ వేదిక నుండి శంఖారావం పూరిస్తున్నామ‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తిరుప‌తిలోని ఎస్వీ హైస్కూల్ మైదానంలో శ‌నివారం టిటిడి విద్యాసంస్థ‌లు, ఇత‌ర పాఠ‌శాల‌ల‌కు చెందిన సుమారు 10 వేల విద్యార్థుల‌తో సామూహిక గీతా పారాయ‌ణం నిర్వ‌హించారు. టిటిడి విద్యాసంస్థ‌లు, ఇస్కాన్‌, ఇత‌ర ధార్మిక సంస్థ‌ల స‌హ‌కారంతో టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ గీతాజ‌యంతి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ వైవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ భ‌గ‌వ‌ద్గీత గొప్ప‌త‌నాన్ని భావిభార‌త పౌరులైన విద్యార్థుల‌కు తెలియ‌జేసేందుకు ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించామ‌న్నారు. ఇంత పెద్ద సంఖ్య‌లో విద్యార్థిని విద్యార్థులు సామూహికంగా గీతా పారాయ‌ణం చేయ‌డం విశేషమ‌న్నారు. ఈ విధంగా, విద్యార్థుల‌ను ప్రోత్స‌హించిన త‌ల్లిదండ్రుల‌కు, శిక్ష‌ణ ఇచ్చిన ఉపాధ్యాయుల‌కు అభినంద‌న‌లు తెలిపారు. విద్యార్థులంద‌రికీ భ‌గ‌వంతుని ఆశీస్సులు ఉండాల‌ని కోరారు. గీత‌లో సైన్స్, టెక్నాల‌జీకి సంబంధించిన ప‌లు అంశాలున్నాయ‌న్నారు. జీవితంలో ఉన్న‌త స్థానానికి చేరుకునేందుకు ఎలాంటి కృషి చేయాలి, ఎలా ఆలోచించాలి అనే విష‌యాలు గీత‌లో ఉన్నాయ‌ని, విద్యార్థులు వీటిని గ్ర‌హించాల‌ని కోరారు. ప్ర‌తి ఇంట్లో భ‌గ‌వద్గీత ఉండేలా, గీతా పారాయ‌ణం జ‌రిగేలా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌న్నారు. టిటిడిలో అన్య‌మ‌త ప్ర‌చార‌మంటూ జ‌రుగుతున్న దుష్ప్ర‌చారానికి అడ్డుక‌ట్ట వేసేందుకు ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లితో పాటు అధికార యంత్రాంగం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. ఇంత చ‌క్క‌టి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన తిరుప‌తి జెఈఓ శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు.

బాధ్య‌త‌ను గుర్తు చేసేదే భ‌గ‌వ‌ద్గీత : డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి

 భ‌గ‌వ‌ద్గీత బాధ్య‌త‌ను గుర్తు చేసి క‌ర్త‌వ్యాన్ని బోధిస్తుంద‌ని తుడ ఛైర్మ‌న్‌, చంద్ర‌గిరి ఎమ్మెల్యే, టిటిడి బోర్డు స‌భ్యులు డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి అన్నారు. మాన‌వుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడ‌దు అన్న విష‌యాలను గీత‌లో భ‌గ‌వంతుడు తెలియ‌జేశాడ‌న్నారు. టిటిడి విద్యాసంస్థ‌ల్లో తాను ప‌దేళ్ల‌పాటు చ‌దువుకున్నాన‌ని, ఎస్వీ హైస్కూల్ మైదానంతో త‌న‌కు ఎన‌లేని అనుబంధం ఉంద‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేసుకున్నారు.

ఆ త‌రువాత తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ మాట్లాడుతూ ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌యవంతం చేసిన అన్ని విభాగాల అధికారుల‌కు, టిటిడి విద్యాసంస్థ‌ల ప్రిన్సిపాళ్ల‌కు, అధ్యాప‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

ఈ సంద‌ర్భంగా ఎస్వీ వేద వ‌ర్సిటీ ఉప‌కుల‌ప‌తి ఆచార్య స‌న్నిధానం సుద‌ర్శ‌న‌శ‌ర్మ‌, హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌ద‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్‌, ఇస్కాన్ ప్ర‌తినిధి శ్రీ వైష్ణ‌వాంఘ్రి సేవ‌క్ దాస్‌, వికాస త‌రంగిణి సంస్థ అధ్యక్షులు డా. నాగేంద్ర‌సాయి, భార‌తీయ విద్యాభ‌వ‌న్ ప్ర‌తినిధి శ్రీ స‌త్య‌నారాయ‌ణ‌రాజు త‌దిత‌రులు ప్ర‌సంగించారు.

గోవింద‌నామాల‌తో ప్రారంభం…

ముందుగా శ్రీ స‌త్యసాయి సేవా సంస్థకు చెందిన శ్రీ శ్రీ‌ధ‌ర్‌, శ్రీ ఫ‌ణిరంగ‌సాయి త‌దిత‌రులు గోవింద‌నామాల‌ను విద్యార్థుల‌తో ప‌లికించారు. విద్యార్థులు ఎంతో భ‌క్తిభావంతో ఈ నామాల‌ను ప‌లికారు. ఆ త‌రువాత శ్రీ లీలాకుమారి ఆధ్వ‌ర్యంలో బ్ర‌హ్మ‌కుమారీలు విద్యార్థుల‌తో ఓంకారం ప‌లికించారు. ఎస్వీ సంగీత క‌ళాశాల అధ్యాప‌కులు, విద్యార్థులు క‌లిసి శ్రీ‌కృష్ణుడిపై అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ను ఆల‌పించారు. ఈ సంద‌ర్భంగా ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ భ‌గ‌వ‌ద్గీత ప్రాశ‌స్త్యాన్ని తెలియ‌జేశారు. గీత మాన‌వ‌త్వం నుండి దైవ‌త్వానికి న‌డిపిస్తుంద‌ని వివ‌రించారు.

సామూహిక గీతాపారాయ‌ణం…

ఎస్వీ వేద వ‌ర్సిటీ, ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల‌కు చెందిన సుమారు 30 మంది వేద విద్యార్థులు సంప్ర‌దాయ వ‌స్త్రధార‌ణ‌లో భ‌గ‌వ‌ద్గీత‌లోని 15వ అధ్యాయ‌మైన పురుషోత్త‌మ ప్రాప్తి యోగంలోని 20 శ్లోకాల‌ను పారాయ‌ణం చేశారు. వీరిని విద్యార్థిని విద్యార్థులు అనుస‌రించి సామూహికంగా పారాయ‌ణం చేశారు. ఆ త‌రువాత విశాఖ‌లోని శ్రీ స‌త్య‌సాయి సేవా సంస్థ‌కు చెందిన ఆధ్యాత్మిక‌వేత్త శ్రీ‌మ‌తి సాయి ప్ర‌స‌న్న ఈ శ్లోకాలకు వివ‌ర‌ణ ఇచ్చారు. పురుషోత్త‌మ ప్రాప్తి యోగం భ‌గ‌వ‌ద్గీత‌కు క‌ర‌దీపిక లాంటిద‌న్నారు. భ‌గ‌వ‌ద్గీత స‌ర్వ ఉప‌నిష‌త్తుల సార‌మ‌ని, విన్నా, చ‌దివినా జీవితం ధ‌న్య‌మ‌వుతుంద‌ని తెలియ‌జేశారు.

విద్యార్థులు ర్యాలీగా వేదిక వ‌ద్ద‌కు…

సామూహిక గీతా పారాయ‌ణం కోసం టిటిడికి చెందిన డిగ్రీ, జూనియ‌ర్ క‌ళాశాల‌లు, పాఠ‌శాల‌ల విద్యార్థులు ర్యాలీగా గోవింద‌నామాలు ప‌లుకుతూ ఎస్వీ హైస్కూల్ మైదానంలోని వేదిక వ‌ద్ద‌కు చేరుకున్నారు. విద్యార్థుల గోవింద‌నామాల‌తో న‌గ‌రం ఆధ్యాత్మికశోభ సంత‌రించుకుంది.

ఈ కార్యక్ర‌మంలో టిటిడి బోర్డు స‌భ్యురాలు శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, విద్యాశాఖాధికారి డా. ర‌మ‌ణ‌ప్ర‌సాద్‌, డెప్యూటీ ఈఓ శ్రీ విజ‌య‌సార‌ధి, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు ఆచార్య బి.విశ్వ‌నాథ్‌, శ్వేత సంచాల‌కులు శ్రీ రామాంజులురెడ్డి, హెచ్‌డిపిపి ఏఈవో శ్రీ నాగేశ్వ‌ర‌రావు, టిటిడి విద్యాసంస్థ‌ల ప్రిన్సిపాళ్లు, అధ్యాప‌కులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.