WINDFALL OF BHAKTI SANKEERTANS AND HARIKATHAS AT NADA MIRANJANAM_ నామసంకీర్తనతో మైమరచి నృత్యం చేసిన భక్తులు

Tirumala, September 25: The pilgrims who thronged the temple town of Tirumala to witness the grandeur of annual brahmotsavams of Srivaru were captivated by the melodious devotional programmes and spiritual discourses organised by TTD on the platforms of Nada Neerajanam and Astana Mandapam on Monday.

The team led by A Usha from Hyderabad entertained the audience at Nada Niranjanam with Annamaiah sankeertans.

Meanwhile the Nama Sankeertan by the Bhagavatar Sri Ayukudi Kumar from Chennai, mesmerized the audience. The devotees also zoomed in devotional fervour and danced to the rhythmic chorus of the Nama Sankeertana.

On the other hand the Bhakti Sankeertana by Smt MPS Madhuri in Asthana Mandapam also enthralled the audience.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

నామసంకీర్తనతో మైమరచి నృత్యం చేసిన భక్తులు

సెప్టెంబర్‌ 25, తిరుమల 2017: తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం రాత్రి జరిగిన చెన్నైకి చెందిన శ్రీ అయికుడి కుమార్‌ భాగవతార్‌ నామసంకీర్తనంతో భక్తులు మైమరిచిపోయి నృత్యం చేశారు. అన్నమయ్య, రామదాసు, త్యాగరాజస్వామి, విఠల్‌ మహరాజ్‌ కీర్తనలను శ్రీ కుమార్‌ ఆలపించగా పిల్లల నుంచి వృద్ధుల వరకు లేచి నిలబడి గోవిందనామస్మరణ చేశారు.

‘నారాయణా.. నారాయణా…’, ‘రాధానంద.. గోపాలకృష్ణా…’, ‘చరణములే నమ్మితి.. నీ దివ్య చరణములే నమ్మితి…’, ‘రాఘవా సుందర… రామ రఘువరా…’, ‘విఠల విఠల పాండురంగ విఠల..’ తదితర కీర్తనలను ఆలపించారు. భజన కీర్తనలు ఆలపిస్తుండగా వాటిని అనుసరిస్తూ చేసిన కోలాటం ఆకట్టుకుంది. మొత్తం 12 మంది గల ఈ బృందంలో ఒక హార్మోనియం, ఒక మృదంగం, ఒక డోల్‌కీ వాద్య కళాకారులు, మిగిలినవారు గాత్ర కళాకారులు ఉన్నారు.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మూత్సవాలను పురస్కరించుకుని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్యప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపం వద్ద ఏర్పాటుచేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు శ్రీవారి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇందులో భాగంగా తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం ఉదయం 5.00 నుండి 5.30 గంటల వరకు బి.లక్ష్మీసువర్ణ, సిహెచ్‌.మల్లేశ్వరస్వామి బృందంచే మంగళధ్వని, ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు తిరుమల ధర్మగిరి వేదపాఠశాల విద్యార్థులచే చతుర్వేద పారాయణం నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 7.00 గంటల వరకు తిరుపతికి చెందిన తిరుపతిలోని భారతీయ విద్యాభవన్‌ బృందంచే విష్ణుసహస్రనామం, ఉదయం 7.00 నుండి 8.30 గంటల వరకు చెన్నైకి చెందిన ఉరగదం కె.లక్ష్మీనరసింహాచార్యులు ధార్మిక ప్రవచనం చేశారు.

మధ్యాహ్నం 4.00 నుంచి 5.30 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన ఎం.ఉష బృందం అన్నమాచార్య సంకీర్తనలను మృదుమధురంగా గానం చేశారు. సాయంత్రం 5.30 నుంచి 7.00 గంటల వరకు చెన్నైకి చెందిన అయికుడి కుమార్‌ భాగవతార్‌ బృందం నామసంకీర్తనం జరిగింది. రాత్రి 7.00 నుంచి 8.00 గంటల వరకు ఊంజల్‌సేవలో శ్రీ గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌, శ్రీమతి ఆర్‌.బుల్లెమ్మ బృందం సంకీర్తనల ఆలాపన, రాత్రి 8.00 నుంచి 9.30 గంటల వరకు తాడేపల్లిగూడేనికి చెందిన శ్రీమతి కె.శారద భాగవతాణి హరికథాగానం చేశారు.

అదేవిధంగా తిరుమలలోని ఆస్థానమండపంలో సోమవారం ఉదయం 11.00 నుంచి 12.30 గంటల వరకు డా|| ఎంపిఎస్‌.మాధురి బ ందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.