WITH THE BLESSINGS OF LORD VENKATESWARA I WAS ELECTED FOR COVETED POST OF VICE PREZ OF INDIA – SRI M VENKAIAH NAIDU_ శ్రీవారి ఆశీస్సులతోనే ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యా : గౌ|| శ్రీ ఎం.వెంకయ్యనాయుడు

Tirumala, 7 August 2017: “Hailing from a normal Farmer’s family and being elected as Vice-President, the second highest position in Indian Constitution with the benign blessings of Lord Venkateswara is the most important day in my life”, expressed, an elated, Sri M Venkaiah Naidu.

The Vice President Elect offered prayers to Lord Venkateswara in Tirumala on Monday along with his family members, before assuming the much coveted position in next few days. The 13th Vice President of India elect, Sri M Venkaiah Naidu offered prayers to the presiding deity. later he was offered Vedasirvachanam in Ranganayakula Mandapam.

TTD EO Sri AK Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju presented theertha prasadams, lamination photo of Lord Venkateswara.

Later speaking to media persons out side temple, the VP elect, Sri M Venkaiah Naidu said, he has been visiting Tirumala temple since his eighth standard. “Everything I attained in my life is with the blessings of Lord Venkateswara. I get new energy and inspiration each time I offer prayers to Lord. I thank every one who supported me to reach this position where I am now today. always love to be with the people. Even if I assume charge as Vice President of India, I will try to reach peopIe as per protocol. They are my oxygen. I prayed Lord to bless the people and the nation with prosperity”, he added.

Temple DyEO Sri Rama Rao, Reception Officials Sri Haridranath, Sri Lakshminarayana Yadav and other officials were present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆశీస్సులతోనే ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యా : గౌ|| శ్రీ ఎం.వెంకయ్యనాయుడు

తిరుమల, 2017 ఆగస్టు 07: సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన తనకు భారతదేశంలోనే అత్యున్నతమైన, రాజ్యాంగబద్ధమైన రెండోవ బాధ్యత అయిన ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశం శ్రీవారి ఆశీస్సులవల్లే వచ్చిందని, ఇది తన జీవితంలో మరచిపోలేని ఘట్టమని ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన గౌ|| శ్రీ ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన సోమవారం ఉదయం శ్రీవేంకటేశ్వరుని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా శ్రీ ఎం.వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ నాలుగు రోజుల్లో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరిస్తానని, ముందుగా కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. దేశప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు చెప్పారు. 8వ తరగతి చదువుకునే రోజుల నుంచి ఇప్పటివరకు ప్రతి ఏడాదీ తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నానని తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనం వల్ల మరింత ఉత్సాహం, ధైర్యం, స్వాంతన, స్ఫూర్తి, విశ్వాసం, వెలుగు వస్తుందన్నారు. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్నాక తనకు కొత్త వెలుగు కనిపించిందని, ఆ వెలుగును ఈ దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, శక్తివంతమైన దేశంగా మార్చేందుకు ఉపయోగిస్తానని తెలిపారు. ప్రతి వ్యక్తికీ దైవచింతన, భక్తి, ఆరాధన, ఆధ్యాత్మికభావన ఉంటే మంచి వ్రవర్తన, సత్‌ బుద్ధి లభిస్తాయన్నారు. పండుగలు, పవిత్రరోజుల్లో తిరుమలకు వచ్చి భక్తులను ఇబ్బంది పెట్టడం తనకు ఇష్టం లేదన్నారు. శ్రీవారి ఆశీస్సుల వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న శ్రీ ఎం.వెంకయ్యనాయుడుకు టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాసరాజు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అటు తర్వాత టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌. శ్రీనివాసరాజు శ్రీవారి తీర్థప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని ఆయనకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో సివిఎస్వో శ్రీ ఎ.రవికృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు, రిసెప్షన్‌ డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్‌, ఓఎస్‌డి శ్రీ లక్ష్మీనారాయణ, క్యాటరింగ్‌ ఆఫీసర్‌ శ్రీజీఎల్‌ఎన్‌ శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.