SRINIVASA KALYANAMS IN AP AND TS FROM AUGUST 9-14_ ఆగస్టు 9 నుంచి 14వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో శ్రీనివాస కల్యాణాలు
Tirupati, 7 August 2017: The Srinivasa Kalyanams will be performed in a series of places in the states of Andhra Pradesh and Telengana from August 9 to 14 under the Srinivasa Kalyanotsavam Project of TTD.
On August 9 in Government College premises in Medak Centre, August 10 in Jogipeta Market Yard in Medak, in Sri Lakshmi Narasimha Swamy temple premises in Khammam on August 11, In Ramalayam premises in Kothagudem on August 12, in Junior college premises of Manuguru mandal of Kothagudem on August 13, in library premises in Cherla mandal of Kothagudem on August 14.
While in AP, the celestial marriages will be performed in Somala mandal of Chittoor district on August 11, Madanapalle on August 14.
In Karantaka, the divine wedding will be performed in HSR layout in Bengaluru on August 12 and at Kadabagre on August 13.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ఆగస్టు 9 నుంచి 14వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో శ్రీనివాస కల్యాణాలు
తిరుపతి, 2017 ఆగస్టు 07: టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఆగష్టు 9వ తేది నుంచి 14వ తేది వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని పది ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి. అన్నిచోట్లా సాయంత్రం 6 గంటలకు కల్యాణాలు ప్రారంభంకానున్నాయి.
తెలంగాణలో.. :
– ఆగస్టు 9వ తేదీన మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజి ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.
– ఆగస్టు 10న మెదక్ జిల్లాలోని జోగిపేట మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.
– ఆగస్టు 11న ఖమ్మం జిల్లా, ఎంకూరు మండలం, గోర్లఒడ్డు గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.
– ఆగస్టు 12న కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలోని రామాలయం ఎదురుగా ఉన్న ప్రాంగణంలో స్వామివారి కల్యాణం జరుగనుంది.
– ఆగస్టు 13న కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సమితిసింగారం గ్రామంలో గల జూనియర్ కళాశాల మైదానంలో శ్రీవారి కల్యాణం చేపడతారు.
– ఆగస్టు 14న కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని గ్రంథాలయ మైదానంలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లో…
– ఆగస్టు 11న చిత్తూరు జిల్లా సోమల మండలం, ఇరికిపెంట గ్రామంలోని ఎంపీపీ పాఠశాల ప్రాంగణంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.
– ఆగస్టు14న చిత్తూరు జిల్లా మదనపల్లి రూరల్ మండలం చిప్పిలి గ్రామంలోని ఎంపీపీ పాఠశాల ప్రాంగణంలో స్వామివారి కల్యాణం జరుగనుంది.
కర్ణాటకలో….
– ఆగస్టు 12న బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లే ఔట్‌లో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.
– ఆగస్టు 13న బెంగళూరులోని కడబాగ్రే ప్రాంతంలో శ్రీవారి కల్యాణం నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.