WORKSHOP AT SV SHILPA KALASHALA FROM SEP 4-6 _ సెప్టెంబర్ 4 నుండి 6వ‌ తేదీ వరకు ఎస్వీ శిల్ప క‌ళాశాల‌లో వ‌ర్క్‌షాప్‌

Tirupati, 02 September 2023: A three-day workshop will be held from September 4 to 6 at the Sri Venkateswara Traditional Temple Sculpture and Architecture Training Institute of TTD on Traditional Temple Sculptures and related topics with expert Sthapathis and Agama scholars of South India. 

The students, alumni and other interested students who are undergoing training in temple construction and sculpture-making will be taught the techniques in this workshop and will be made aware of various technical aspects.

The program will begin on September 4 at 10 am.  On the first day, Sthapati Sri Santana Krishnan of Chennai will speak on “Technical Aspects of Temple and Gopuram Construction According to Shilpashastras”, Sthapati Sri Somasekhar of Bangalore will deliver lecture on “Technical Aspects of Metal Sculpture” and Sri V.Srinivasa Reddy of Srikalahasti on “Technical Aspects of Traditional Kalamkari Art”.  

On the second day on September 5, Sthapathi Sri Jayendran of Kancheepuram will give a lecture on the topic “Characteristics of Statues according to Shilpashastras”, the Head of the Department of Fine Arts, Kadapa Yogi Vemana University, Dr.  K. Mrityunjaya Rao will speak on “Traditional Indian Art”.  Similarly, Sthapathi Sri HS Nagaraju of Hindupur on “Technical Aspects of Stone Sculpture Making” guest lecturers from National Sanskrit University Dr.  P. Srinivasakrishna Reddy will speak on “Legendary Sculptures in Ancient Temples”.

On the third day, on September 6, Sthapati Sri T. Kadirivan of Mahabalipuram will speak on “Technical Aspects in the Making of Darushilpam” and  Dr Gopalakrishna from Bengaluru will deliver a lecture on “Temple Sculpture during the Period of the Vijayanagara Kings in Hampi”.

Similarly, Tirupati Vedic University Vaikhanasa Agama Department President Dr. T. Brahmacharya on “Vedas, Agamas, Indian Culture, Sanatana Dharma”, Sthapathi Sri T. of Mysore.  Devendra Achari will speak on “3D Visualization on Temples and Sculptures.

The Principal Sri Venkat Reddy is supervising the arrangements.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబర్ 4 నుండి 6వ‌ తేదీ వరకు ఎస్వీ శిల్ప క‌ళాశాల‌లో వ‌ర్క్‌షాప్‌

తిరుప‌తి, 2023 సెప్టెంబ‌రు 02: టీటీడీకి చెందిన శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణ సంస్థలో సెప్టెంబర్ 4 నుండి 6వ‌ తేదీ వరకు సంప్రదాయ ఆలయ శిల్పకళలు – అనుబంధ అంశాలపై దక్షిణ భారతదేశంలోని నిష్ణాతులైన స్థపతులు, ఆగమ పండితులతో మూడు రోజులపాటు వర్కుషాప్ జ‌రుగ‌నుంది. ఆలయ నిర్మాణం, శిల్పాల త‌యారీపై శిక్షణ పొందుతున్న విద్యార్థులకు, పూర్వవిద్యార్థులకు, ఆస‌క్తి గ‌ల ఇత‌ర విద్యార్థుల‌కు ఈ వ‌ర్క్‌షాప్‌లో మెళకువలు తెలియ‌జేయ‌డంతో ప‌లు సాంకేతిక అంశాలపై అవగాహన కల్పిస్తారు.

సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 10 గంట‌ల‌కు ఈ కార్యక్రమం ప్రారంభ‌మ‌వుతుంది. మొద‌టిరోజు చెన్నైకి చెందిన స్థ‌పతి శ్రీ సంతాన కృష్ణన్ “శిల్పశాస్త్రాల ప్రకారం దేవాలయం, గోపురాల నిర్మాణంలో సాంకేతిక అంశాలు” అనే అంశంపై, బెంగళూరుకు చెందిన స్థపతి శ్రీ సోమశేఖర్ “లోహశిల్ప తయారీ విధానంలో సాంకేతిక అంశాలు” అనే అంశంపై, శ్రీ‌కాళ‌హ‌స్తికి చెందిన శ్రీ వి.శ్రీనివాస రెడ్డి “సాంప్రదాయ కలంకారి కళలో సాంకేతిక అంశాలు” అనే అంశాలపై ఉపన్యసిస్తారు.

రెండో రోజు సెప్టెంబర్ 5న‌ కాంచీపురానికి చెందిన స్థపతి శ్రీ జయేంద్రన్ “శిల్పశాస్త్రాల ప్రకారం ప్రతిమా లక్షణం” అనే అంశంపై, కడప యోగి వేమన యూనివర్సిటీలోని ఫైన్ ఆర్ట్స్ విభాగాధిప‌తి డా. కె.మృత్యుంజయ రావు “భారతీయ సంప్రదాయ చిత్రకళ ” అనే అంశంపై ప్రసంగిస్తారు. అదేవిధంగా, హిందూపూర్‌కు చెందిన స్థపతి శ్రీ హెచ్.ఎస్.నాగరాజు “రాతి శిల్పం తయారీలో సాంకేతిక అంశాలు” అనే అంశంపై, జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యానికి చెందిన అతిథి అధ్యాపకులు డా. పి.శ్రీనివాసక్రిష్ణారెడ్డి “పురాతన దేవాలయాలలో పురాణకథల శిల్పాలు” అనే అంశాలపై ప్ర‌సంగిస్తారు.

మూడో రోజు సెప్టెంబర్ 6న‌ మహాబలిపురానికి చెందిన స్థపతి శ్రీ టి.కదిరివన్ “దారుశిల్పం తయారీలో సాంకేతిక అంశాలు” అనే అంశంపై, బెంగళూరుకు చెందిన డా. గోపాలక్రిష్ణ “హంపిలోని విజయనగర రాజుల కాలంనాటి దేవాలయ శిల్పకళ ” అనే అంశంపై ఉప‌న్య‌సిస్తారు. అదేవిధంగా, తిరుపతి వేదిక్ యూనివర్శిటీ వైఖానస ఆగమ విభాగ అధ్యక్షులు డా. టి.బ్రహ్మాచార్యులు “వేదాలు, ఆగమాలు, భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం” అనే అంశంపై, మైసూరుకు చెందిన స్థపతి శ్రీ టి. దేవేంద్ర ఆచారి “దేవాలయాలు, శిల్పాలపై 3డి విజువలైజేషన్” అనే అంశాలపై ప్రసంగిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.