WORSHIP OF COW IS WORSHIP OF GOVINDA- SAYS SARADAPEETHAM PONTIFF _ గోవును పూజించి గోవిందుడిని ద‌ర్శించ‌డం ఉత్త‌మం : విశాఖ శార‌ద పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామి

Tirupati, 19 Dec. 19: Pontiff of Vizag Sarada peetham Sri Sri Sri Swaroopananda swami said that worship of Cow was Worship of Govinda.

Speaking to reporters after visiting the Sapta Go Pradakshina shala under construction at Alipiri he lauded the TTD for constructing the Go shala at Alipiri to facilitate worship by devotees on way to Tirumala by transport or walk.

Congratulating the TTD officials Sri Singhal and Sri Dharma Reddy and the TTD board member Sri Sekhar Reddy for their contributions in getting up the unique go shala, the pontiff also paid a visited to the Go Tulabharam and Go Sadan. He also unvieled a statue of Gopalakrishna in the complex.

TTD EO Sri Anil Kumar Singhal, Additional EO Sri AV Dharma Reddy, Board special invitee Sri Sekhar Reddy participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

గోవును పూజించి గోవిందుడిని ద‌ర్శించ‌డం ఉత్త‌మం : విశాఖ శార‌ద పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామి

తిరుమ‌ల‌, 19 డిసెంబ‌రు 2019: గోవుల‌ను పూజించిన త‌రువాత తిరుమ‌ల‌లో గోవిందుడిని ద‌ర్శించుకోవ‌డం ఎంతో ఉత్త‌మ‌మైంద‌ని విశాఖ శార‌ద పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామి ఉద్ఘాటించారు. తిరుప‌తిలోని అలిపిరిలో నిర్మాణంలో ఉన్న స‌ప్త‌గోప్ర‌ద‌క్షిణశాల‌ను గురువారం సాయంత్రం విశాఖ శార‌ద ఉత్త‌ర పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వాత్మానందేంద్ర స‌ర‌స్వ‌తి స్వామితో క‌లిసి స్వామీజీ సంద‌ర్శించారు.

ఈ సంద‌ర్భంగా  శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామి మీడియాతో మాట్లాడుతూ తిరుమ‌ల‌కు వాహ‌నాల్లో వెళ్లేవారుగానీ, న‌డిచి వెళ్లే భ‌క్తులు గానీ అలిపిరి వ‌ద్ద గోపూజ చేసుకునేందుకు వీలుగా స‌ప్త‌గోప్ర‌ద‌క్షిణశాల శిలా క‌ట్ట‌డాన్ని టిటిడి నిర్మించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. శాస్త్రం ప్ర‌కారం గంగ, గోవు, గోవిందుడు… అంటార‌ని తెలిపారు. ఈ నిర్మాణానికి విరాళం అందించిన టిటిడి బోర్డు ప్ర‌త్యేక ఆహ్వానితులు శ్రీ శేఖ‌ర్‌రెడ్డికి స్వామివారి ఆశీస్సులు ఉంటాయ‌న్నారు. ఇందుకు కృషి చేసిన టిటిడి ఈవో శ్రీ  అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డిని అభినందించారు. అనంత‌రం గోవిజ్ఞాన‌కేంద్రం, గో తులాభారం, గోస‌ద‌న్‌ను స్వామీజీలు సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా గోప్ర‌ద‌క్షిణ‌శాల‌లో గోపాల‌కృష్ణుని విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో శ్రీ  అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు ప్ర‌త్యేక ఆహ్వానితులు శ్రీ శేఖ‌ర్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.