YAKSHA GANAM STEALS THE SHOW _ నయనానందకరం “యక్షగానం ”ప్రేక్షకులను కట్టిపడేసిన ప్రదర్శనలు

TIRUPATI, 30 SEPTEMBER 2022: The cultural programs organized by TTD in Tirupati as a part of the ongoing annual bramhotsavams in Tirumala, have mesmerized the pilgrims on Friday at Mahati.

Sri Shankara Narayana Yakshagana Sangha from Karnataka has presented the ancient art of Yakshagana showcasing the “Ekadasivrata Mahatyam” episode.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నయనానందకరం “యక్షగానం ”

ప్రేక్షకులను కట్టిపడేసిన ప్రదర్శనలు

తిరుపతి 30 సెప్టెంబరు 2022 ;   తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్బంగా మహతి కళాక్షేత్రం లో శుక్రవారం రాత్రి నిర్వహించిన యక్షగాన ప్రదర్శనలు ప్రేక్షకులను కట్టిపడేశాయి .

సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యాన కర్ణాటక రాష్ట్రం కాసరఘడ్ నుండి విచ్చేసినశ్రీ శంకరనారాయణ యక్షగాన కళాసంఘ వారు “ఏకాదశీవ్రత మహత్మ్యం” కనుమరుగైపోతున్న సంప్రదాయ జానపద నృత్యం “యక్ష గానం”  ద్వారా అద్భుతంగా అభినయించారు.
 

భగీరథుని మనుమడు, సూర్యవంశ రాజైన శ్రుతుని పుత్రుడు రుక్మాంగదమహారాజు సంతానంకొరకు నారదముని సలహా మేరకు, శ్రీమహావిష్ణువు అనుగ్రహం కొరకు  ఆచరించిన ఏకాదశీవ్రతం కథను చక్కగా భక్తి భావంతో ప్రదర్శించినతీరు చూపరులను ఆకట్టుకున్నది.

 

ఈ కార్యక్రమానికి భాగవతునిగా లంబోదర హెగ్డె, మద్దెలపై చంద్రయ్య ఆచార్, ఛండ్రపై భాస్కర ఆచార్యలు సహకరించగా, కుమార, శుభేక్షణ, పరమేశ్వర ఉడుప తదితరులు అభినయించారు.
 

ఈ కార్యక్రమంలో  టీటీడీ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ తిరుపతి సుధాకర్,  అన్నమాచార్య ప్రాజెక్టు పూర్వ సంచాలకులు ఆచార్య సింగరాజు దక్షిణామూర్తిశర్మ,  సప్తగిరి ఉపసంపాదకురాలు డా.అల్లాడి సంధ్య పెద్ద సంఖ్యలో  ప్రేక్షకులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది