YOGA NRISIMHA BLESSES DEVOTEES_ సింహ వాహనంపై యోగ నరసింహుడి అవతారంలో శ్రీ మలయప్ప

Tirumala, 2 Oct. 19: As a part of the ongoing annual Navaratri Brahmotsavams, Sri Malayappa Swamy took out a celestial ride on Simha Vahanam and blessed the devotees in Yoga Narasimha Avataram.

Simha, the lion is a symbol of strength, dignity, majesty, ferocious which was reflected in the vahana seva of Sri Malayappa Swamy. The incarnation of Lord Vishnu as Mrugendrudu (most ferocious and strong among the animals, Lion) is an indication of Lord as a powerful avatar to punish the wrong doers in the universe and protection of the righteous, poor and the weaker sections in the society.

In the Yoga Shastra – a Lion was seen as an embodiment of power and speed. The valor of Lord Venkateswara who had made such an animal as his vehicle is thus displayed in abundance.

The statues of Lions in the Ananda Nilayam, in the Srivari temple complex  also indicate the power of Lion King. The idols of Narasimha Swamy in Yoga mudra in Srivari temple  and also the idol of Lakshmi Narasimha on the way to Tirumala in Alipiri footpath route exhibits the significance of Lion (Simha) in the celestial entourage of Lord Venkateswara  

TTD Chairman Sri YV Subba Reddy, EO Sri Anil Kumar Singhal, Addl EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, ACVO Sri Sivakumar Reddy, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Lokanadham and others took part.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs.TIRUPATI

 

 

 

సింహ వాహనంపై యోగ నరసింహుడి అవతారంలో శ్రీ మలయప్ప

అక్టోబరు 02, తిరుమ‌ల‌, 2019: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన బుధ‌వారం ఉదయం అనంతతేజోమూర్తి అయిన శ్రీ మలయప్పస్వామివారు యోగ న‌ర‌సింహుని అవ‌తారంలో సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

సింహ వాహనం – ధైర్య‌సిద్ధి

శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహంపై కూర్చొని ఊరేగుతారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతాలవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు.

కాగా, మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8 నుండి 10 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, ఎస్వీబీసీ ఛైర్మ‌న్ శ్రీ పృథ్విరాజ్, ప‌లువురు ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు పాల్గొన్నారు.

కాగా, బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజైన గురువారం ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనంపై శ్రీవారు ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.