MOBILE CLINICS FOR PILGRIMS-CMO_ మొబైల్ క్లినిక్‌లతో యాత్రికుల‌కు వైద్య‌సేవ‌లు : టిటిడి ముఖ్య వైద్యాధికారి డా. ఎస్‌.నాగేశ్వ‌ర‌రావు

Tirumala, 1 Oct. 19: The Chief Medical Officer of TTD, Dr S Nageswara Rao said, the department has set up mobile clinics to offer services to needy pilgrims during brahmotsavams.

Briefing media at Media Centre, the CMO said, six dispensaries and six First Aid centers have been offering round the clock services in Tirumala apart from one Apollo Cardiac Centre. “For this brahmotsavams, we have deployed 40 doctors and 90 paramedical staff and also set up Emergency Cells at BIRRD, SV Medical College and SVIMS. While for Garuda Seva, we have set up Mobile Clinics in all four corners of the Mada Streets to cater to the needs of the pilgrims”, he added. 

Further, he said, among the doctors who are deployed for Brahmotsavams, Ortho and Heart Specialists have also been called for and 13 Ambulances will be plying 24X7 to offer services to pilgrims. The Head of Medical wing said, the Aswini Hospital which is under renovation will get ready by the month-end and we will be able to provide advanced medication to the pilgrims as well to the locals”, he said.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs.TIRUPATI

2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

మొబైల్ క్లినిక్‌లతో యాత్రికుల‌కు వైద్య‌సేవ‌లు : టిటిడి ముఖ్య వైద్యాధికారి డా. ఎస్‌.నాగేశ్వ‌ర‌రావు

అక్టోబరు 01, తిరుమల, 2019:  బ్ర‌హ్మోత్స‌వాల‌కు విచ్చేసే యాత్రికుల‌కు మొబైల్ క్లినిక్‌ల ద్వారా త్వ‌రిత‌గ‌తిన వైద్య‌సేవ‌లందిస్తున్నామ‌ని టిటిడి ముఖ్య వైద్యాధికారి డా. ఎస్‌.నాగేశ్వ‌ర‌రావు తెలిపారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్‌లో మంగ‌ళ‌వారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

 ఈ సంద‌ర్భంగా సిఎంఓ మాట్లాడుతూ తిరుమలలో అశ్విని ఆసుప‌త్రి, అపోలో ఎమ‌ర్జ‌న్సీ కార్డియాక్ సెంట‌ర్‌తోపాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1, 2, గాలిగోపురం, ఎటిసి, క‌ల్యాణ‌క‌ట్ట ప్రాంతాల్లో, ఉద్యోగులకు క‌లిపి 6 డిస్పెన్స‌రీలు ఉన్నాయ‌ని వివ‌రించారు. పిఏసి-2, రాంభగీచా విశ్రాంతి గృహం, కాలిబాట మార్గంలోని ఏడో మైలు, పాపవినాశనం, వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నం, భాష్య‌కార్ల స‌న్నిధి, శ్రీ‌వారి ఆల‌యంలోప‌ల, నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాలు, అలిపిరి, అలిపిరి మార్గంలో 1500వ‌ మెట్టు, శ్రీ‌వారి మెట్టు వ‌ద్ద క‌లిపి 11 ప్ర‌థ‌మ చికిత్స కేంద్రాలు ఉన్నాయ‌న్నారు. మొత్తం 45 మంది డాక్ట‌ర్లు, 90 మంది పారామెడిక‌ల్ సిబ్బంది కలిపి మొత్తం 135 మంది అందుబాటులో ఉన్న‌ట్టు వెల్ల‌డించారు. సాధారణ చికిత్సతోపాటు కార్డియాలజి, ఆర్థోపెడిక్స్‌, జనరల్‌ సర్జరీ మెడిసిన్‌, ఎమర్జన్సీ మెడిసిన్‌ విభాగాల వైద్యులు కూడా ఉన్నార‌ని తెలిపారు. గ‌రుడ‌సేవ‌నాడు అత్య‌వ‌స‌ర వైద్య‌సేవ‌లు అందించేందుకు తిరుమలలోని అశ్విని ఆసుపత్రి, తిరుపతిలోని స్విమ్స్‌, బర్డ్‌, రుయా, టిటిడి కేంద్రీయ వైద్యశాలల్లో అత్య‌వ‌స‌ర విభాగాల‌ను ఏర్పాటుచేసిన‌ట్టు తెలిపారు. భ‌క్తుల‌ ర‌ద్దీ దృష్ట్యా మాడ వీధుల నాలుగు మూల‌ల్లో సీనియ‌ర్ డాక్ట‌ర్లతోపాటు మందుల‌తో బ్యాట‌రీ వాహ‌నం అందుబాటులో ఉంటుంద‌న్నారు.

మొత్తం 13 అంబులెన్సులు ఉన్నాయ‌ని, ఇందులో 108 అంబులెన్సులు 7 ఉన్నాయ‌ని తెలిపారు. వాహ‌నం ఊరేగింపు వెన‌క 1, నాలుగు మాడ వీధుల్లో 4 అంబులెన్సులు ఉంటాయ‌ని, నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాలు, శ్రీ‌వారి మెట్టు వ‌ద్ద మొబైల్ అంబులెన్సు ఉంటుంద‌ని వివ‌రించారు. తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో అపోలో ఎమర్జన్సీ కార్డియాక్‌ సెంటర్‌ అందుబాటులో ఉందని, ఇక్కడ గుండెపోటుకు గురైన వారికి, ఇతరులకు అత్యవసర వైద్యసేవలు అందిస్తారని తెలియ‌జేశారు. తిరుమ‌ల‌లోని అశ్విని ఆసుప‌త్రిని ఆధునిక వ‌స‌తుల‌తో త్వ‌ర‌లో అందుబాటులోకి తీసుకొస్తామ‌ని వివ‌రించారు.

మీడియా స‌మావేశంలో టిటిడి స‌హాయ ప్ర‌జాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.