YOU ARE THE TORCH BEARERS OF TTD-TIRUPATI JEO TO CALL CENTRE STAFFS_ భక్తులతో వినమ్రంగా మాట్లాడాలి: టిటిడి తిరుపతి జేఈవో శ్రీ పోల భాస్కర్‌

Tirupati, 6 June 2018: Describing the staffs working in TTD Call Centre, Information Centre and May I Help You Counters as “Torch Bearers” of TTD, Tirupati JEO Sri P Bhaskar directed them to enhance their levels of patience while dealing with the pilgrims.

The second phase of two-day training class to Call Centre, Information Centre and May I Help You Counters staffs took place in SVETA building on Wednesday in Tirupati. JEO who took part in the inaugural session, said, every day TTD Call Centre staffs are attending to nearly 2000-3000 calls by pilgrims across the country as well the world. As such, you need to be more patient even if the pilgrim on the other side is arrogant in his or her approach. Always keep in your mind that the way you react with the pilgrim, ultimately reflects on the image of the institution. TTD has commenced the training programme for days in every month to the call centre staffs from last month on wards. “In the next phase training session, the concerned HoDs will also be included in the training programme to clear the doubts of the call centre staff to give replies with more perfection, to the frequently asked questions they usually receive from the pilgrims”, he added.

Later GM Transport and IT Wing Chief Sri Sesha Reddy interacted with the staff members of call centres and cleared their doubts related to IT services. He also informed them to be updated on the happenings in TTD, especially with respect to pilgrim services. “Mostly 90% of the information is static like the arjitha sevas, festivals etc. You should be careful with the remaining 10% dynamic information that includes on-line services, accommodation, refund etc. which keeps on changing from time to time”, he maintained.

In the evening session, Sapthagiri Chief Editor Dr Radha Ramana cleared the doubts raised by the call centre staffs. SVETA Director In-charge Col.Chandrasekhar Manda, APRO Ms P Neelima were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

భక్తులతో వినమ్రంగా మాట్లాడాలి: టిటిడి తిరుపతి జేఈవో శ్రీ పోల భాస్కర్‌

జూన్‌6, తిరుపతి 2018: తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రతిష్టకు ఎలాంటి విఘాతం కల్గించకుండా కలియుగదైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి భక్తులతో వినమ్రంగా మాట్లాడాలని, వారు అడిగే ప్రశ్నలకు ఓర్పు, నేర్పుతో సమాధానాలు ఇవ్వాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ తెలిపారు. తిరుపతిలోని శ్వేతా భవనంలో టిటిడి సమాచార కేంద్రాలు, మే ఐ హెల్ప్‌ యూ, కాల్‌ సెంటర్స్‌ సిబ్బందితో బుధవారం రెండో విడత రెండు రోజుల శిక్షణా తరగతులు జరిగాయి.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు తిరుమల సమాచారం, స్వామివారి సేవలు, విరాళాలు, వైద్యం, శ్రీవారిసేవ, సప్తగిరి మాస పత్రిక, వివిధ ట్రస్ట్‌లు వంటి ఇతర సమాచారం తెలుసుకునేందుకు టిటిడిలోని కాల్‌ సెంటర్స్‌కు ఫోన్‌లు చేస్తుంటారని, ఒక్కోసారి భక్తులు కోపంతో మాట్లాడినా సిబ్బంది ఓర్పుగా వారికి కావాల్సిన సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎప్పటికప్పుడు మెరుగైన సమాచారాన్ని భక్తులకు ఇవ్వడానికి టిటిడిలోని తాజా సమాచారాన్ని తెలుసుకోవాలన్నారు. ఇప్పటివరకు వ్యక్తిత్వవికాసం, సమాచార నైపుణ్యాలపై (కమ్యూనికేషన్‌ స్కిల్స్‌) స్థానిక నిపుణులు, అనుభవజ్ఞులతో సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని, రాబోవు రోజుల్లో వివిధ ప్రాంతాలలో ఉన్న నిష్ణాతులను ఆహ్వానించి శిక్షణ ఇస్తామన్నారు. టిటిడిలోని వివిధ విభాగాలకు సంబంధించిన అంశాలపై ఫిర్యాదులు, సూచనలు, సలహాలు అందుతున్నాయో ఆయా విభాగాధిపతులు ఇకపై జరుగనున్న శిక్షణా కార్యక్రమాలలో పాల్గొంటారని తెలిపారు. ఈ ఏడాది మే నెలలో ప్రారంభమైన ఈ శిక్షణా తరగతులు ఇకపై ప్రతినెలా జరుగుతాయన్నారు.

అనంతరం ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి మాట్లాడుతూ టిటిడిలో 90 శాతం స్థిరమైన సమాచారం ఉంటుందని, మిగిలిన 10 శాతం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందన్నారు. మారుతున్న సమాచారాన్ని సిబ్బంది ఎప్పటికప్పుడు తెలుసుకుని భక్తులకు తెలియజేయాలని ఆయన తెలిపారు. మధ్యాహ్నం జరిగిన శిక్షణా తరగతుల్లో సప్తగిరి మాస పత్రిక ఎడిటర్‌ డా. రాధారమణ పాల్గొని సిబ్బంది సందేహాలను నివృత్తి చేశారు.

ఈ సమావేశంలో టిటిడి శ్వేత ఇంచార్జీ డైరెక్టర్‌ శ్రీ మంద చంద్రశేఖర్‌, సహాయ ప్రజాసంబంధాల అధికారి కుమారి నీలిమ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.