TTD GEAR UP FOR DHARMARADHA YATRA IN SRIKAULAM_ జూన్‌ 9 నుండి జులై 9వ తేదీ వరకు శ్రీకాకుళం జిల్లాలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ధర్మరథయాత్ర : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Tirupati, 6 June 2018: As a part of the promotion of Hindu Dharma Prachara, the Dharmaratha Ratha Yatra will be observed for a period of one month from June 9 to July 9 in Srikakulam.

In this connection, Tirupati JEO Sri P Bhaskar held a review meeting in his chambers in TTD Administrative Building on Wednesday with concerned officials.

He instructed the PR and SVBC to give wide coverage for the programme and directed the Press DyEO to distribute devotional books. He also reviewed on other essential arrangements for the month long fete including staff deputation, transportation, route map, devotional programs, srinivasa kalyanam performing venues etc.

HDPP chief Sri Ramana Prasad, Estates Officer Sri Vijayasaradhi, EE Marketing Sri Jagdishwar Reddy and others were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జూన్‌ 9 నుండి జులై 9వ తేదీ వరకు శ్రీకాకుళం జిల్లాలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ధర్మరథయాత్ర : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

జూన్‌ 06, తిరుపతి 2018: శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేయడంతోపాటు సనాతన ధర్మాన్ని ప్రచారం చేసేందుకు జూన్‌ 9 నుండి జులై 9వ తేదీ వరకు నెల రోజుల పాటు శ్రీకాకుళం జిల్లాలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ధర్మరథయాత్ర నిర్వహించనున్నట్టు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ వెల్లడించారు. ఈ మేరకు ధర్మరథయాత్ర గోడపత్రికలను బుధవారం రాత్రి తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో జెఈవో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలోని అన్ని మండలాల్లో ధర్మరథయాత్ర జరుగుతుందని, భక్తులు పాల్గొని పూజలు నిర్వహించాలని అన్నారు. రథం ఎదుట భజనలు, గోవిందనామస్మరణ చేయాలన్నారు. ఒక పండుగలా రథయాత్రను జరుపుకోవాలని కోరారు. భక్తులకు శ్రీ పద్మావతి అమ్మవారి కుంకుమ, స్వామివారి ప్రసాదం, కంకణాలు అందిస్తామన్నారు. సాయంకాలం విడిది గ్రామాల్లో ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. జూన్‌ 16, 23, 30, జులై 7, 9వ తేదీల్లో ఆయా ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తామన్నారు.

అనంతరం ధర్మరథయాత్ర నిర్వహణపై ఆయా విభాగాల అధికారులతో జెఈవో సమావేశం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో శ్రీవారి సేవకులను ఈ యాత్రలో భాగస్వాములను చేయాలని సూచించారు. రథయాత్రకు అవసరమైన వాహనాలు సమకూర్చాలని, ఉచితంగా పుస్తక ప్రసాదం అందించాలని, మెడికల్‌ కిట్లు అందుబాటులో ఉంచాలని, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాల కోసం అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు కళాబృందాలను ఆహ్వానించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి డా|| రమణప్రసాద్‌, శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ప్రభాకర్‌రావు, సిఎంవో డా|| నాగేశ్వరరావు, ఎస్టేట్‌ అధికారి శ్రీ విజయసారధి, ఇఇ శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీమతి భారతి, శ్రీ ధనంజయ, ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీమతి వైవిఎస్‌.పద్మావతి ఇతర అధికారులు పాల్గొన్నారు.

—————————————————————-

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.