YUVA DHARMIKA SAMMELANAM CONCLUDES IN TIRUMALA _ తిరుమలలో ఘనంగా ముగిసిన యువ ధార్మికోత్సవం
Tirumala, 06 February 2023: The two-day programme, Yuva Dharmika Sammelanam concluded on a grand note at the Asthana Mandapam in Tirumala on Monday.
Sri Rachuri Raghavendracharya from Atmashrama of Bengaluru in his electrifying speech motivated hundreds of young girls and boys who participated in this maiden programme from Tamilnadu, Karnataka apart from the two Telugu speaking states.
He interacted with them and received their opinions on what qualities need to be imbibed to become ethical and spiritual. The youth have also shared their experience saying that they learnt many useful things for building their career and live under the guidance of their parents and Gurus.
Later, some of them rendered Dasa Padas while a few others performed Kolatam on the occasion.
Dasa Sahitya Project Special Officer Sri Ananda Theerthacharyulu was also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తిరుమలలో ఘనంగా ముగిసిన యువ ధార్మికోత్సవం
తిరుమల, 2023 ఫిబ్రవరి 06: తిరుమల ఆస్థాన మండపంలో దాసహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న యువ ధార్మికోత్సవం సోమవారం ఘనంగా ముగిశాయి.
ఈ సందర్భంగా బెంగుళూరుకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాఘవేంద్రచార్యులు మాట్లాడుతూ చిన్నతనం నుండి ఆధ్యాత్మికత, దైవభక్తి కలిగి ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నారు.
పిల్లలకు తల్లిదండ్రులు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల్లోని పలు అంశాలను విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు.
అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు తాము తెలుసుకున్న ఆధ్యాత్మిక అంశాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో దాసహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి శ్రీ ఆనంద తీర్థ చార్యులు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక నుండి విచ్చేసిన దాదాపు 1600 మంది 10 నుండి 15 సంవత్సరాల విద్యార్థులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.