AYODHYA KANDA PARAYANAM DIKSHA FROM OCTOBER 21-NOVEMBER 16 _ అక్టోబరు 21 నుండి నవంబరు 16వ తేదీ వరకు అయోధ్య కాండ పారాయణ దీక్ష
Tirumala, 19 Oct. 21: As part of its spiritual endeavour to protect humanity from pandemic Corona, TTD TTD is organising Ayodhyakanda parayanam Diksha seeking Srivari blessings from October 21-November 16 at the Vasantha Mandapams in Tirumala.
Simultaneously the TTD is organising Shloka parayanam, Japam, Tarpana and Homas at Dharmagiri Veda vijnan peetham.
TTD is organising Ankurarpanam fete for both Vedic programs on October 21 evening at Dharmagiri peetham.
The SVBC will daily telecast from 08.30-10.00 am the proceedings of the Sapta Vishanti Dinatmaka Ayodhya Kanda parayanam Diksha.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI
అక్టోబరు 21 నుండి నవంబరు 16వ తేదీ వరకు అయోధ్య కాండ పారాయణ దీక్ష
తిరుమల, 2021 అక్టోబరు 19: లోక సంక్షేమం కోసం, కరోనా వ్యాప్తిని అరికట్టాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలో అక్టోబరు 21 నుండి నవంబరు 16వ తేదీ వరకు అయోధ్య కాండ పారాయణ దీక్ష జరుగనుంది. తిరుమల వసంత మండపంలో శ్లోక పారాయణం, ధర్మగిరి శ్రీ వేంకటేశ్వర వేద విఙ్ఞాన పీఠంలో జప, తర్పణ, హోమాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందుకోసం అక్టోబరు 20న బుధవారం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు అంకురార్పణ జరుగనుంది.
సప్తవింశతి దినాత్మక అయోధ్య కాండ పారాయణ దీక్ష కార్యక్రమాన్ని ప్రతిరోజూ ఉదయం 8:30 నుండి 10 గంటల వరకు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.