SRIVARI BRAHMOTSAVA DARSHAN FROM OCTOBER 7-14 TO 1000 DEVOTEES FROM BACKWARD CLASSES _ అక్టోబ‌రు 7 నుండి 14వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వ ద‌ర్శ‌నం

  • FREE BUSES TO BRING DEVOTEES FROM 13 DISTRICTS WHERE TTD BUILT SRIVARI TEMPLES

 Tirumala, 04 October 2021: TTD Is making all arrangements for providing free Srivari Brahmotsavam Darshan to devotees hailing from backward classes where TTD has built Srivari temples devotees across the state.

It may be mentioned here that for the propagation of Hindu Sanatana Dharma and to put an end to religious conversions in the state, the AP state Endowments Department, TTD and Samarasata Seva Foundation had in the first phase built 502 SV temples at a cost of Rs. 25 crore in all 13 districts in remote regions of the AP.

Now 500 devotees from these regions will be brought in 10 buses from each of 11 districts apart from 20 buses from Visakhapatnam and East Godavari districts (1000 devotees as they have agency and plain areas) to Tirumala during Brahmotsavams and will be provided Srivari Brahmotsava Darshanam from October 7 to 14. They will also be provided darshan of Sri Padmavathi Ammavaru.

TTD said two members from Samarasata Seva foundation will accompany each bus to supervise the food and shelter needs of devotees enroute with the support of local donors and thereafter organise darshans, food and Prasadam for them at Tirumala, Tiruchanoor etc. and return journey.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అక్టోబ‌రు 7 నుండి 14వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వ ద‌ర్శ‌నం

– రోజుకు వెయ్యి మంది వెనుక‌బ‌డిన వ‌ర్గాల భ‌క్తులు

– 13 జిల్లాల నుండి ఉచితంగా బ‌స్సులు
 
తిరుమల, 2021 అక్టోబ‌రు 04: రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి క‌లిపి రోజుకు వెయ్యి మంది చొప్పున వెనుక‌బ‌డిన వ‌ర్గాల భ‌క్తుల‌కు అక్టోబ‌రు 7 నుండి 14వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వ ద‌ర్శ‌నం చేయించేందుకు టిటిడి ఏర్పాట్లు చేప‌ట్టింది. వీరికి తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నంతోపాటు తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ద‌ర్శ‌నం చేయించ‌డం జ‌రుగుతుంది.

హిందూ ధ‌ర్మాన్ని ప్ర‌చారం చేసేందుకు, మ‌త మార్పిడుల‌ను అరిక‌ట్టేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ‌తో క‌లిసి స‌మ‌ర‌స‌త సేవా ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో టిటిడి మొద‌టి విడ‌త‌లో రూ.25 కోట్ల‌తో 13 జిల్లాల్లో 502 ఆల‌యాల‌ను నిర్మించిన విష‌యం తెలిసిందే. ఈ ఆల‌యాలు నిర్మించిన వెనుక‌బ‌డిన‌ ప్రాంతాల నుండి బ్ర‌హ్మోత్స‌వాల స‌మ‌యంలో భ‌క్తుల‌ను ఆహ్వానించి శ్రీ‌వారి ద‌ర్శనం చేయించ‌డం జ‌రుగుతుంది. ఒక్కో జిల్లా నుండి 10 బ‌స్సులు ఏర్పాటుచేసి భ‌క్తుల‌ను ఉచితంగా తిరుమ‌ల‌కు తీసుకురావ‌డం జ‌రుగుతుంది. తూర్పుగోదావ‌రి, విశాఖ జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువ‌గా ఉండ‌డంతో 20 బ‌స్సులు ఏర్పాటు చేయ‌డ‌మైన‌ది. ఒక్కో బ‌స్సులో ఇద్ద‌రు స‌మ‌ర‌స‌త సేవా ఫౌండేష‌న్ ప్ర‌తినిధులు ఉంటారు. దూర ప్రాంతాల నుండి వ‌చ్చే భ‌క్తుల‌కు స్థానిక దాతల స‌హ‌కారంతో భోజ‌నాలు అందించేందుకు టిటిడి ఏర్పాట్లు చేప‌ట్టింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.