ANNAMAIAH WAS A BIGGEST SOCIAL REFORMER _ అన్నమయ్య గొప్ప సామాజికవేత్త : ఆచార్య భూమన కుసుమకుమారి
TIRUPATI, 06 APRIL 2024: Saint Poet and Telugu Padakavita Pitamaha Sri Tallapaka Annamacharya was not only a great literary laureate but also a biggest social reformer during his period, said Prof. B Kusuma Kumari.
Speaking during a literary meet organised by TTD on the occasion of the 521st Annamacharya Vardhanti fete by Annamacharya Project in Annamacharya Kalamandiram, the Telugu exponent delivered talk on Annamaiah – Samajikata and said he revolutionised the existing superstitions in the society six centuries ago by bringing social awareness among the denizens through his Sankeertans.
Dr Soujanaya of Brahmasamudram who spoke on Annamaiah – Naitikata said the saint poet raised his voice against inequalities through impeccable kritis like Tandanana Ahi and many other lores.
Dr Lokeswari of Nellore spoke on Imact of Annamacharya on Vengamba and said both of them sensitized the society against social evils through their great literary works.
Project Director Dr Vibhishana Sharma and others were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
అన్నమయ్య గొప్ప సామాజికవేత్త : ఆచార్య భూమన కుసుమకుమారి
తిరుపతి, 2024 ఏప్రిల్ 06: భగవంతుని దృష్టిలో మనుషులందరూ సమానమేనని తన సంకీర్తనల ద్వారా చాటి చెప్పిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య గొప్ప సామాజికవేత్త అని
శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ విసి ఆచార్య భూమన కుసుమకుమారి చెప్పారు. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 521వ వర్థంతి ఉత్సవాలు శనివారం రెండో రోజుకు చేరుకున్నాయి.
ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య కుసుమకుమారి “అన్నమయ్య – సామాజికత” అనే అంశంపై ఉపన్యసించారు. 600 సంవత్సరాల క్రితం అప్పటి సామాజిక పరిస్థితులకు వ్యతిరేకంగా అన్నమయ్య గళం విప్పారని చెప్పారు. పలు సంకీర్తనల్లో ఆనాటి గ్రామీణ పరిస్థితులు, పాడి పంటలు, సాగునీరు, కుటుంబ సంబంధాలు తదితర అంశాలను తెలియజేశారని అన్నారు. మహిళలకు సమాన అవకాశాలు ఉండాలని నొక్కి చెప్పారని తెలిపారు. అత్యంత సంస్కారవంతంగా శృంగార సంకీర్తనలు రచించి భక్తి భావాన్ని వ్యాప్తి చేశారని తెలియజేశారు.
అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రంకు చెందిన ఉపన్యాసకులు డా.సౌజన్య ”అన్నమయ్య – నైతికత ” అనే అంశంపై ఉపన్యసించారు. ఆనాటి సామాజిక పరిస్థితుల్లో అన్ని వృత్తుల వారు సమానమేనని, రాజు – పేద తేడాలు ఉండకూడదని, అందరికీ శ్రీహరే అంతరాత్మ అని అన్నమయ్య శ్రీవేంకటేశ్వరస్వామివారిని కేంద్రంగా చేసుకుని సంకీర్తనలు రచించి వ్యాప్తి చేశారని చెప్పారు. ఆశ్రమధర్మాల్లో గృహస్తాశ్రమ గొప్పదనాన్ని సంకీర్తన ద్వారా తెలియజేశారన్నారు. ఈ విషయాలను సాధారణ ప్రజలకు సైతం అర్థమయ్యేలా అన్నమయ్య సంకీర్తనలు రచించారన్నారు. శ్రీవారిపై భక్తి ద్వారా అన్నమయ్య సంపూర్ణ మానవజీవనాన్ని చవిచూశారని వివరించారు.
అనంతరం నెల్లూరు క్లాసికల్ తెలుగు సెంటర్ పరిశోదకులు డా.లోకేశ్వరి ” వెంగమాంబపై అన్నమయ్య ప్రభావం ” అనే అంశంపై ప్రసంగిస్తూ, వెంగమాంబ సాహిత్యంపై అన్నమయ్య ప్రభావం మెండుగా ఉందన్నారు.
ఇద్దరి సంకీర్తనలు జానపద శైలిలో, సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా ఉంటాయని తెలియజేశారు. శ్రీవారి ఆలయంలో ఏకాంత సేవలో అన్నమయ్య లాలిపాటను వెంగమాంబ ముత్యాలహారతిని ప్రవేశపెట్టారని చెప్పారు.
సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నంకు చెందిన హరిత సిస్టర్స్ మరియు గ్రంధి సాయికృతి బృందం సంగీత సభ జరుగుతుంది . రాత్రి 7 గంటలకు హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి తిరుమల బృందం గాత్ర సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
అంతకుముందు ఉదయం 9 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు
శ్రీ మధుసూధ నరావు బృందం సంగీత సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, పుర ప్రజలు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.