VEHICLES WITH OTHER RELIGIOUS SIGNS, PERSONS PHOTOS HAVE NO ENTRY IN TIRUMALA _ అన్యమత ప్రచార సామగ్రి, వ్యక్తుల ఫోటోలు తిరుమలకు నిషేధం – భక్తులు ఈ విషయం గమనించాలని టీటీడీ విజ్ఞప్తి

DEVOTEES ARE APPEALED TO NOTE

 

TIRUMALA, 07 MAY 2022: The devotees who are coming to Tirumala for the darshan of Sri Venkateswara Swamy are not supposed to carry other faith signs, deities, person’s photos, political party flags etc.

 

This rule has been under implementation since several decades in TTD. But some devotees unaware and unmindful of this regulation are coming to Tirumala with photos of other faiths, favourite political and celebrities, political flags etc. on their vehicles.

 

The Vigilance sleuths while checking the vehicles at Alipiri, explains the rule and remove the stickers and flags as it is against TTD norms.

 

The devotees are appealed to be aware of this important regulation of TTD and co-operate with the management.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

అన్యమత ప్రచార సామగ్రి, వ్యక్తుల ఫోటోలు తిరుమలకు నిషేధం
– భక్తులు ఈ విషయం గమనించాలని టీటీడీ విజ్ఞప్తి

తిరుమ‌ల‌, 2022 మే 06: శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తులు త‌మ వాహ‌నాల‌కు వ్య‌క్తుల ఫోటోలు, రాజ‌కీయ పార్టీల జెండాలు, చిహ్నాలు, అన్య‌మ‌త ప్ర‌చారానికి సంబంధించిన ప్ర‌చార సామ‌గ్రి, తిరుమ‌లకు తీసుకువెళ్ళ‌డాన్ని టీటీడీ కొన్ని దశాబ్దాల క్రితమే నిషేధించింది.

టీటీడీ భ‌ద్ర‌తా సిబ్బంది అలిపిరి వ‌ద్ద అటువంటి వాహ‌నాల‌ను తిరుమ‌ల‌కు అనుమ‌తించ‌రు. ఇది టీటీడీ ఎన్నో ద‌శాబ్ధాలుగా అనుస‌రిస్తున్న నిబంధ‌న‌. ఇటీవల కాలంలో తిరుమల కు వాహనాల్లో వచ్చే భక్తులు అవగాహనా రాహిత్యంతో వ్యక్తుల ఫోటోలు, అన్యమత చిహ్నాలు, రాజకీయ పార్టీల జెండాలతో రావడం జరుగుతోంది. వీటిని విజిలెన్స్ సిబ్బంది వాహనదారులకు విషయం వివరించి వాటిని తీసివేయడం జరుగుతోంది.

కావున వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి స‌హ‌క‌రించ‌వ‌ల‌సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.