అలిపిరి న‌డ‌క మార్గంలో రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు అనుమ‌తి – ఈవో

అలిపిరి న‌డ‌క మార్గంలో రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు అనుమ‌తి – ఈవో
   
తిరుపతి, 2010 ఆగష్టు 19: అలిపిరి-తిరుమల మధ్య నడిచివెళ్ళే భక్తులను ఇకపై ఉదయం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అనుమతిస్తారు. అటవీశాఖ అధికారులు రెండవ చిరుత పులిని కూడ పట్టుకున్నారు. గనుక దీనిని దృష్టిలో పెట్టుకొని పాదచారులకు నిబంధనలు మరింత సడలించనున్నట్లు తి.తి.దే. ఇ.ఓ.
ఐ.వై.ఆర్‌. కృష్ణారావు తెలిపారు.

సోమవారం ఉదయం తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అటవీశాఖ అధికారులు రెండు పులులను పట్టుకున్నారని, ఇవి కాలినడక మార్గంలో ఉన్న జింకల పార్కు దగ్గర జింకల కోసం అలవాటు పడ్డాయని, అటవీశాఖ అధికారులు దొరికిన రెండు పులులను తెల్లవారు ఝామున రెండు గంటలకే పట్టుకోవడం జరిగింది. కనుక రాత్రి సమయాలలో పాదచారులు కాలినడక దారిలో వెళ్ళడం నిషేధించడమైనది. భక్తులు నడక దారిలో గుంపులు గుంపులుగా వెళ్ళవలసినదిగా కోరడమైనది.

అదేవిధంగా తితిదే విజిలెన్సు సిబ్బంది కాలినడక దారిలో ముఖ్యంగా రాత్రి సమయాలలో భక్తుల భద్రత కోసం పూర్తి పహరా కాస్తున్నారు. కావున భక్తులు ఈ మార్పుని గమనించి రాత్రి 10 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు కాలినడక దారిలో వెళ్ళవద్దని ఇ.ఓ ఒక ప్రకటనలో మనవి చేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.