JEO HEALTH AND EDUCATION INSPECTS TRANSLATIONS WORKS _ అష్టాదశ పురాణాల అనువాద పనులను పరిశీలించిన జెఈవో
Tirupati, 28 Jan. 21: TTD Joint Executive Officer (Health and Education) Smt Sada Bhargavi on Thursday inspected the ongoing translation works on Astadasha Puranams at SVETA Bhavan in Tirupati and directed officials to speed up the works.
JEO instructed officials of the Purana Itihasa project to speed up the completion of printing and publication of the Vishnu Maha Puranam, Brahma Puranam and Hari Puranam before the Rathasapthami festival.
As part of the exercise, the JEO reviewed the progress of the ongoing translation work of Agni Puranam and directed officials and pundits to complete the printing work as early as possible.
Prominent pundits engaged in the Translation works were Dr Samudrala Lakshmaiah of Tirupati, Sri Rama Suryanarayana, Sri S Satyanarayana Murthy, Sri Prabhakar Sharma, Sri Sripadam Subramaniam of Hyderabad, Sri VV Sitaramacharyulu of Ponnuru, Sri D Prabhakar Krishnamurthy of Nidadavolu, Sri KS Visweswara Sharma of Anantapur, Dr PPVD Nagathrishul Phani and Sri Shuram Srinivasulu of Bengaluru
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అష్టాదశ పురాణాల అనువాద పనులను పరిశీలించిన జెఈవో
తిరుపతి, 2021 జనవరి 28: తిరుపతిలోని శ్వేత భవనంలో టిటిడి పురాణ ఇతిహాస ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరుగుతున్న అష్టాదశ పురాణాల అనువాద పనులను జెఈవో(ఆరోగ్యం, విద్య) శ్రీమతి సదా భార్గవి గురువారం పరిశీలించారు.
జెఈవో గతంలో పలుమార్లు టిటిడి ప్రాజెక్టులను తనిఖీ చేసి ప్రచురణలను వేగవంతం చేయాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా పురాణ ఇతిహాస ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరుగుతున్న విష్ణుపురాణం, బ్రహ్మపురాణం, హరిపురాణం గ్రంథాలను రథసప్తమి పర్వదినంలోపు ముద్రణ పూర్తి చేయాలని సూచించారు. ఈ క్రమంలో ప్రస్తుతం శ్వేత భవనంలోని ప్రాజెక్టు కార్యాలయంలో అగ్నిపురాణం సంస్కృతం నుండి తెలుగులోకి అనువాదం జరుగుతున్న తీరును జెఈవో పరిశీలించారు. వీలైనంత త్వరగా అనువాదాన్ని పూర్తి చేసి పురాణాలను ముద్రించాలని పండితులను కోరారు.
ఈ అనువాద కార్యక్రమంలో ప్రముఖ పండితులు తిరుపతికి చెందిన డా. సముద్రాల లక్ష్మణయ్య, శ్రీ కె.రామసూర్య నారాయణ, శ్రీ ఎస్.సత్యనారాయణ మూర్తి, శ్రీ జి.ప్రభాకర శర్మ, హైదరాబాద్‌కు చెందిన శ్రీ శ్రీపాద సుబ్రమణ్యం, పొన్నూరుకు చెందిన శ్రీ వి.వి.సీతారామాచార్యులు, నిడదవోలుకు చెందిన శ్రీ డి.ప్రభాకర కృష్ణమూర్తి, అనంతపురానికి చెందిన శ్రీ కెకె.విశ్వేశ్వర శర్మ, డా. పిపివిడి.నాగత్రిశూల ఫణి, బెంగళూరుకు చెందిన శ్రీ శూరం శ్రీనివాసులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.