GOKULASHTAMI FETE AT SRI VENKATESWARA SAPTA GO PRADAKSHINA MANDIRAM ON AUGUST 19_ ఆగస్టు 19న శ్రీ వేంకటేశ్వరసప్త గో ప్రదక్షణ మందిరంలో గోకులాష్టమి  వేడుకలు

GOKULASHTAMI FETE AT SRI VENKATESWARA SAPTA GO PRADAKSHINA MANDIRAM ON AUGUST 19

Tirupati,18 August 2022: For the first time TTD is organising grand Gokulashtami celebrations on August 19 at Sri Venkateswara Sapta Go Pradakshina Mandiram constructed in Alipiri.

 

As part of the celebrations Abhisekam, Visesha Puja will be performed to Sri Krishna Swami ahead of Go puja in the morning.

 

Besides from SV Gosala, TTD is observing the Gokulasthami fete at Alipiri Saptha Go Pradakshina Mandiram in a big way.

 

Elaborate arrangements are underway for the Mahotsavam. Devotees will be provided jaggery, rice, fodder and grass to feed the bovines as feeding animals and Go puja are held sacred and begetting good virtues.

 

In the evening TTD has also rolled out bhajans, Kolatas, Sankeertana Gana by artists of HDPP and Annamacharya projects.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగస్టు 19న శ్రీ వేంకటేశ్వరసప్త గో ప్రదక్షణ మందిరంలో గోకులాష్టమి  వేడుకలు

తిరుపతి, 2022 ఆగస్టు 18: వద్ద టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వర సప్త గో ప్రదక్షణ మందిరంలో ఆగస్టు 19వ తేదీన తొలిసారిగా గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సంధర్బంగా శ్రీ కృష్ణ స్వామి వారికి ఉదయం 8 నుండి 9 గంటల వరకు అభిషేకం, విశేష పూజ నిర్వహిస్తారు. ఉదయం 9 నుండి 10 -30 గంటల వరకు గోపూజ నిర్వహిస్తారు.

శ్రీకృష్ణ భగవానుని జన్మదిన మహోత్సవాన్ని గోకులాష్టమిగా నిర్వహించడం హైందవ సంప్రదాయం. హిందువుల అతిముఖ్యమైన పండుగలలో ఒకటైన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను గోశాలలో ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తున్న టీటీడీ, తొలిసారిగా సప్త గో ప్రదక్షణ మందిరంలో కూడా గోకులాష్టమి వేడుకలు నిర్వహించనుంది. ఇందుకోసం గో ప్రదక్షణ మందిరంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

భక్తులు గోవులకు బెల్లం, బియ్యం, పశుగ్రాసాన్ని దానంగా అందించే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. గోవుకు మేతదానం చేస్తే మహాపుణ్యఫలమని భక్తుల నమ్మకం.

ఈ సందర్భంగా ఉదయం 8 గంట‌ల‌ నుండి టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో అన్నమాచార్య సంకీర్తన గానం, భజనలు, కోలాటాలు, సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు హరికథ కార్యక్రమం నిర్వహించనున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.