ఆగస్టు 28వ తేదీన ”ఆంధ్రజ్యోతి” దినపత్రిక నందు ప్రచురించిన ‘పోతనకు అపచారం’ అనే వార్త‌కు
వివరణ

ఆగస్టు 28వ తేదీన ”ఆంధ్రజ్యోతి” దినపత్రిక నందు ప్రచురించిన ‘పోతనకు అపచారం’ అనే వార్త‌కు
వివరణ

ఆగస్టు 28వ తేదీన ”ఆంధ్రజ్యోతి” దినపత్రిక నందు ప్రచురించిన ‘పోతనకు అపచారం’ అనే శీర్షికతో ప్రచురించిన వార్త వాస్తవ దూరం.

తితిదేలో ముద్రించబడే అన్ని గ్రంథాల ప్రచురణ ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ పర్యవేక్షణలో జరుగదు. కొన్ని ఆయా ప్రాజెక్టు అధిపతుల పర్యవేక్షణలోనే జరుగుతాయి. ”భర్తృహరి నీతిశతకము – పోతన భాగవతము” అన్న గ్రంథం ధర్మప్రచార పరిషత్తుకు సంబంధించినది. దీని ప్రచురణ వారి పర్యవేక్షణలో జరిగింది. ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ పర్యవేక్షణలో జరుగలేదు. అందువల్ల అందులోని పొరపాట్లకు ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ బాధ్యులు కారు. అయితే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో అచ్చుతప్పులను దిద్దుతున్నారని తెలియజేస్తున్నాం.

ఈ కథనంలో మహాభారత పునర్ముద్రణ ప్రసక్తి తెచ్చి ఇందులో దొర్లిన అచ్చుతప్పులను ఏళ్లు గడుస్తున్నా ఇంకా దిద్దుతూనే ఉన్నారు అనే ఒక అభియోగం చేయబడింది. ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ కార్యాలయం ఏర్పడిన తరువాతే మహాభారతం ద్వితీయ ముద్రణకై ప్రయత్నాలు వేగవంతమైనాయి. ఇది సుమారు పద్నాలుగు వేల పేజీల భృహద్గ్రంథం కావున ఎంతో జాగ్రత్తగా సవరణలు, పూరణలు చేయవలసి ఉంటుంది. పండితుల సహాయంతో నిరంతరం కృషి చేసి ఈ గ్రంథాన్ని పునర్ముద్రణకు సిద్ధం చేయడం జరిగింది. సి.డిలు కూడా సిద్ధమైనాయి. అంతేకాక ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ కార్యాలయం ఏర్పడిన తరువాత ‘బాలభారతి’ (హిందీ, ఆంగ్లానువాదాలు), ఎంతోకాలం ముద్రణకాకుండా ఉన్న గ్రంథాల ముద్రణ, తిరుమలక్షేత్రదర్శిని, బ్రహ్మమొక్కటే, భారతీయ సంస్కృతి మొదలైన శీర్షికలతో వివిధ గ్రంథాల ముద్రణ, తితిదే ఇంతకుముందు ముద్రించిన ఉత్తమగ్రంథాల అనువాదం మొదలైన ఎన్నో కొత్త కార్యక్రమాలను చేపట్టి ముందుకుపోతోంది. అంతేగాక ఐదారేండ్ల కింద ప్రారంభింపబడి ఆగిపోయిన పోతన భాగవత వ్యాఖ్యను కూడా ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ కార్యాలయం పునఃప్రారంభించి త్వరగా పూర్తి కావడానికి కృషి చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌పై వారికి సంబంధించని గ్రంథంలోని దోషాలను గురించి అసత్యమైన ఆరోపణలు చేయడం అనుచితం.

కనుక పైతెల్పిన వాస్తవాల్ని రేపటి మీ దినపత్రికనందు వివరణగా ప్రచురించాల్సినదిగా కోరడమైనది.

ప్రజాసంబంధాల అధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి