IT’S A DAY OF APRICOTS AND PISTA DURING SNAPANAM _ ఆప్రికాట్‌, పిస్తా, అత్తి మాల‌లు, కిరీటాల‌తో శాస్త్రోక్తంగా స్న‌ప‌నతిరుమంజ‌నం

Tirumala, 21 Sep. 20: When the Garlands of Dry Seeds stolen the show during the first day of Snapanam, its the day of dry fruits which marked their presence on the Second day.

The garlands, jewels, crown made of Apricots, Pista, Cardamom, figs, paddy etc. marked the grand Snapana Tirumanjanam fete that took place on Monday as part of the ongoing annual Brahmotsavam in Tirumala temple.

The Ranganayakula Mandapam was richly decorated with orchids and cut flowers. The entire event was live telecasted by the SVBC channel.

TTD EO Sri Anil Kumar Singhal, Addl EO Sri AV Dharma Reddy, TTD Board Members Sri DP Anantha, Sri Shivakumar, Sri Sekhar Reddy, Temple DyEO Sri Haridranath were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

2020 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

ఆప్రికాట్‌, పిస్తా, అత్తి మాల‌లు, కిరీటాల‌తో శాస్త్రోక్తంగా స్న‌ప‌నతిరుమంజ‌నం

తిరుమల, 2020 సెప్టెంబ‌రు 21: శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా సోమ‌వారం శ్రీ‌వారి ఆల‌యంలో ఆప్రికాట్‌, పిస్తా, అత్తితో  ప్ర‌త్యేకంగా రూపొందించిన మాల‌ల‌తో స్న‌ప‌న‌తిరుమంజ‌నం శాస్త్రోక్తంగా జ‌రిగింది. రంగ‌నాయ‌కుల మండ‌పంలో ప్ర‌త్యేక వేదిక‌పై ఆశీనులైన శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌కు వేదమంత్రాల న‌డుమ కంక‌ణ‌భ‌ట్టార్ శ్రీ గోవిందాచార్యులు ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

దాదాపు రెండు గంట‌ల పాటు జ‌రిగిన స్న‌ప‌న‌తిరుమంజ‌నంలో వివిధ‌ ర‌కాల మాల‌ల‌తో శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు అభ‌య‌మిచ్చారు. ప‌లు ర‌కాల సుగంధ ద్ర‌వ్యాల‌తో అభిషేకం చేస్తుండ‌గా, ప్ర‌త్యేక మాల‌ల‌ను అలంక‌రించారు. ఆప్రికాట్‌, పిస్తా, అత్తి, యాల‌కులు, మొగిలిపూలు, వ‌డ్ల‌గింజ‌లు, న‌ల్ల ప‌విత్రాల‌తో త‌‌యారు చేసిన మాల‌లు, కిరీటాలను స్వామి, అమ్మ‌వార్ల‌కు అలంక‌రించామ‌ని ఉద్యానవ‌న విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు తెలిపారు. రంగ‌నాయకుల మండ‌పాన్ని ఆర్కిడ్లు, క‌ట్ రోజాల‌తో శోభాయ‌మానంగా అలంక‌రించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.

ఈ కార్య‌క్ర‌మంలో ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.