GAIN AUTHORITY IN AYURVEDA-AYURVEDIC EXPERT DR SURESH _ ఆయుర్వేద వైద్య విద్యార్థులు ఆయుర్వేద వైద్య గ్రంధాలపై పట్టు సాధించాలి

TIRUPATI, 30 JULY 2022:  The students who are studying Ayurveda shall have to gain authority over the Ayurvedic sciences by acquiring the knowledge embedded in the great books, said founder of European Ayurveda Academy Dr Suresh.

During his visit to SV Ayurvedic college in Tirupati on Saturday, the Ayur Expert said, he has noticed immense interest among the foreigners to learn the vast knowledge that is present in our ancient books. “Not only that, they are following healthy food habits in their everyday life. So far I have presented four talks on Ayurveda in the British Parliament, which shows their love and respect for our Ayurveda”, he observed.

While complimenting the TTD for its initiatives in the promotion of ancient science, he urged the students to master themselves in Ayurveda and become good doctors in the field.

College Principal Dr Muralikrishna, Dr Harshavardhan, Dr Renu Dixit and other faculty students were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

DR SURESH ADDRESSING

ఆయుర్వేద వైద్య విద్యార్థులు ఆయుర్వేద వైద్య గ్రంధాలపై పట్టు సాధించాలి

యూరోపియన్ ఆయుర్వేద అకాడమి వ్యవస్థాపక అధ్యక్ష్యుడు డాక్టర్ సురేష్

తిరుపతి 30 జూలై 2022: ఆయుర్వేద విద్యార్థులు ఆయుర్వేద మూల గ్రంధాల మీద పట్టు సాధించాలని యూరోపియన్ ఆయుర్వేద అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సురేష్ స్వర్ణపురి అన్నారు . శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థి అయిన డాక్టర్ సురేష్ శనివారం సాయంత్రం తిరుపతికి వచ్చిన సందర్భంగా ఎస్ వి ఆయుర్వేద కళాశాల విద్యార్థులతో సమావేశమయ్యారు .

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుర్వేద వైద్య విద్యార్థులు ప్రాచీన ఆయుర్వేద గ్రంధాల్లోని అనేక అంశాలను తెలుసుకోవాలనే ఉత్సాహం తాను పర్యటించిన యూరోపియన్ దేశాలలో ఇతర పాశ్చాత్య దేశాల్లో స్పష్టంగా కనిపించిందన్నారు. వారు ఆయుర్వేద ఆహారపు సూత్రాలను ఆరోగ్య సూత్రాలను తెలుసుకోవడానికి వాటిని ఆచరించడానికి ఉత్సాహం చూపిస్తారని డాక్టర్ సురేష్ తెలిపారు తనకు బ్రిటిష్ పార్లమెంట్లో నాలుగు సార్లు ఆయుర్వేద వైద్యంపై ప్రసంగించే అవకాశం కలిగిందని అక్కడి ప్రభుత్వం ప్రజలు ప్రాచీన ఆయుర్వేద వైద్యానికి ఎంతో ప్రాధాన్యత గౌరవం ఇవ్వడమే ఇందు కారణమన్నారు ఆయుర్వేద వైద్య విద్యార్థులు ఆయుర్వేద సూత్రాలను చక్కగా అర్థం చేసుకుని టీటీడీ కల్పించే సౌకర్యాలను వినియోగించుకోవాలని తద్వారా మంచి ఆయుర్వేద వైద్యులుగా రాణించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ డాక్టర్ రేణు దీక్షిత్ డాక్టర్ హర్షవర్ధన్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది