BASELESS REPORTS ON TTD EO TRANSFER _ ఈవో బదిలీ వార్తలు అవాస్తవం

–      GOVT. GO NOT UNDERSTOOD BY SOME NEWSPAPERS

 Tirupati, 29 Apr. 21: TTD on Thursday clarified that media reports of TTD E O Dr KS Jawahar Reddy were baseless.

Contending that a section of media has misunderstood the Govt GO issued two days ago the TTD clarified that Dr Reddy has been recently made chairman of AP state Covid Command  Control Centre in addition to his Post TTD EO .in view of his vast experience and successful handling of Covid 1.0 earlier as State Health and Family Welfare secretary.

Two days ago to facilitate his effective functioning as Chairman of the AP Covid Command Control Centre the Govt shifted his Headquarters to Velagapudi and asked the Additional EO Sri Dharma Reddy to take care of daily affairs of EO.

TTD statement reiterated that a section of media had wrongly interpreted the recent Govt GO and that Dr KS Jawahar Reddy still continued as TTD EO.

 ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఈవో బదిలీ వార్తలు అవాస్తవం

– ప్రభుత్వ ఉత్తర్వులు కొన్ని పత్రికలు సరిగా అర్థం చేసుకోలేదు

తిరుపతి 29 ఏప్రిల్ 2021: టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేసినట్లు గురువారం కొన్ని పత్రికల్లో ప్రచురితమైన వార్తలు అవాస్తవం. కోవిడ్ 19 కట్టడిలో ఎంతో అనుభవం ఉన్న డాక్టర్ జవహర్ రెడ్డి సేవలను ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం ఆయన్ను కోవిడ్ కమాండ్ కంట్రోల్ చైర్మన్ గా నియమించింది. ఇందులోభాగంగా డాక్టర్ జవహర్ రెడ్డి హెడ్ క్వార్టర్స్ ను తాత్కాలికంగా వెలగపూడి మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈవో రోజువారీ కార్యకలాపాలను అదనపు ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి కి ప్రభుత్వం అప్పగించింది. ప్రభుత్వ ఉత్తర్వులు కొన్ని పత్రికల్లో తప్పుగా ప్రచురితం అయ్యాయి.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది