JEO (E&H) INSPECTED WORKS AT SGS ARTS COLLEGE _ ఎస్ జి ఎస్ ఆర్ట్స్ కళాశాలలో అభివృద్ధి పనులు పరిశీలించిన జెఈవో శ్రీమతి సదా భార్గవి

COMMENCES SECURITY AT COLLEGE WITH 32 CC CAMERAS

 

Tirupati, 06 October 2022: TTD JEO (H and E)  Smt Sada Bhargavi on Friday inspected the ongoing development works at Sri Govindarajaswami Arts College including the installation of 32 CC camera security systems costing 2.10 lakhs.

 

Speaking later TTD JEO advised officials to maintain greenery and complete all by Monday.  She also urged teachers to strive for the enhancement of Bhakti and moral values among students.

 

Among others, she directed the officials to remove waste material lying in the college and expressed happiness over walkers’ tracks in the college premises.

 

DEO Sri. Govindarajan,   Sri Venkateswaralu, DFO Sri Srinivas and others were present.

 
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్ జి ఎస్ ఆర్ట్స్ కళాశాలలో అభివృద్ధి పనులు పరిశీలించిన జెఈవో శ్రీమతి సదా భార్గవి

– 32 కెమెరాలతో సిసి టివి వ్యవస్థ ను ప్రారంభించిన
జెఈవో

తిరుపతి  6 అక్టోబరు 2022: శ్రీ గోవిందరాజ స్వామి ఆర్ట్స్ కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను జెఈవో శ్రీమతి సదా భార్గవి గురువారం సాయంత్రం పరిశీలించారు . ఈ సందర్బంగా ఆమె కళాశాల పూర్వ విద్యార్థుల అసోసియేషన్ రూ 2లక్షల 10 వేలతో 32 కెమెరాలతో ఏర్పాటు చేసిన సిసి టివి వ్యవస్థను ప్రారంభించారు . కళాశాలలో భద్రత కోసం సి సి టివి వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె చెప్పారు.

కళాశాలలోని ల్యాబ్ లు, కారిడార్ ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం వివిధ విభాగాల అధికారులతో ఆమె సమావేశమయ్యారు. కళాశాల ఆవరణం పచ్చదనంతో ఆహ్లాదంగా ఉండేలా విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. లైబ్రరీ, తరగతి గదులతో పాటు మొత్తం పనులన్నీ సోమవారం నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. కళాశాలకు కావాల్సిన వసతులపై చర్చించారు. కళాశాలలో విద్యా ప్రమాణాలు మరింతగా మెరుగు పడేలా చర్యలు తీసుకోవాలని అధ్యాపకులను ఆదేశించారు. విద్యార్థులకు చదువు తో పాటు ఆధ్యాత్మిక అంశాలు, నైతిక విలువలు పెంచేలా కృషి చేయాలని జెఈవో కోరారు.

అనంతరం ఆమె కళాశాల ప్రాంగణం మొత్తం తిరిగారు. వ్యర్థాలు, పిచ్చి మొక్కలు తొలగించాలని చెప్పారు. వాకర్స్ ట్రాక్ ను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.

డిఈవో శ్రీ గోవింద రాజన్, ఎస్ఈ శ్రీ వెంకటేశ్వర్లు, డిఎఫ్ ఓ శ్రీ శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్ర కేశవులు నాయుడు, పూర్వ విద్యార్థుల అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ విజయ్ కుమార్ తో పాటు ఇంజినీరింగ్, ఆరోగ్య విభాగం అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది