TTD GEARS UP FOR UGADI CELEBBRATIONS _ ఏప్రిల్ 2న ఉగాది ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తి
TIRUPATI, 01 APRIL 2022: To welcome Subhakrutnama Samvatsara Telugu Ugadi in a big way, TTD is gearing up to observe the festivities in Mahati Auditorium on April 2.
The HDPP and welfare wings of TTD will jointly organise the Ugadi Celebrations with a series of programmes which commences at 9:30am on Saturday. The activities includes Mangala Dhwani, Veda Swasti, Panchanga Sravanam, cultural and traditional fancy dress programs etc. The event concludes with the distribution of Ugadi Pacchadi.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఏప్రిల్ 2న ఉగాది ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తి
తిరుపతి, 2022 ఏప్రిల్ 01: టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్ 2న శనివారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జరుగనున్న శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఉదయం 9.30 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ముందుగా ఎస్.వి సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళధ్వని, టిటిడి ఎస్.వి ఉన్నత వేదాధ్యయన సంస్థవారిచే వేదస్వస్తి నిర్వహిస్తారు. ఈ సందర్భంగా టిటిడి ఆగమ సలహాదారు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆచార్య వేదాంతం శ్రీవిష్ణుభట్టాచార్యులు పంచాంగ శ్రవణం చేస్తారు.
అనంతరం టిటిడి ఉద్యోగుల పిల్లలకు వేషధారణ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు. అనంతరం ఉగాది పచ్చడి పంపిణీ చేస్తారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.