REVIEW ON KARTHIKA DEEPOTSAVAMS _ కార్తీక దీపోత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు ముంద‌స్తు ఏర్పాట్లు : టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

TIRUPATI, 28 OCTOBER 2022: TTD officials are informed to gear up to observe Karthika Deepotsavams in a grand manner by EO Sri AV Dharma Reddy.

A review meeting with officials concerned took place at the chambers of EO in the TTD Administrative Building in Tirupati on Friday evening.

Speaking on the occasion the EO said the festival of lights in the holy month of Karthika should be observed at Yaganti in Nandyala on November 7, Vizag on November 14 and before Tiruchanoor Brahmotsavams in Tirupati.

He also reviewed on the arrangements to be made for the mega religious events, commentators to be deployed, facilities for deputation staffs, engineering works to be done etc.

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, SVBC CEO Sri Shanmukh Kumar, CE Sri Nageswara Rao, SEs Sri Jagadeeshwar Reddy, Sri Venkateswarulu, Vedic varsity Registrar Sri Radhesyam, All Projects Special Officer Snt Vijaya Lakshmi, Principal of SV College of Music and Dance Sri Sudhakar were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

కార్తీక దీపోత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు ముంద‌స్తు ఏర్పాట్లు : టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుప‌తి, 2022 అక్టోబ‌రు 28: నంద్యాల జిల్లా యాగంటిలో న‌వంబ‌రు 7వ తేదీ, విశాఖ‌ప‌ట్నంలో న‌వంబ‌రు 14న, శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు ముందు తిరుప‌తిలో కార్తీక దీపోత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు ముంద‌స్తు ఏర్పాట్లు చేప‌ట్టాల‌ని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలోని కార్యాల‌యంలో శుక్ర‌వారం సాయంత్రం ఆయ‌న అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ గ‌తంలో నిర్వ‌హించిన కార్తీక దీపోత్స‌వాల్లో ఏవైనా చిన్న‌పాటి లోటుపాట్లు జ‌రిగి ఉంటే ఈసారి పున‌రావృతం కాకుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఇంజినీరింగ్ అధికారులు కార్తీక దీపోత్స‌వాలు నిర్వ‌హించే మైదానాల‌ను ప‌రిశీలించి అవ‌స‌ర‌మైన ప‌నులు వేగంగా పూర్తి చేయాల‌న్నారు. దీపోత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు వెళ్లే అధికారులు, సిబ్బందికి త‌గిన వ‌స‌తి, ఆహారం ఏర్పాటు చేయ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌ణ‌, వ్యాఖ్యానం లాంటి ప‌నులు స‌మ‌న్వ‌యంతో నిర్వ‌హించుకుని కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసి భ‌క్తుల‌కు స్వామివారి ఆశీస్సులు అందేలా చూడాల‌న్నారు.

జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గవి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, ఎస్వీబీసీ సీఈవో శ్రీ ష‌ణ్ముఖ్ కుమార్‌, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇలు శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, శ్రీ వెంక‌టేశ్వ‌ర్లు, ఎస్వీ వేద వ‌ర్సిటీ రిజిస్ట్రార్ డా. రాధేశ్యామ్‌, డిపిపి ప్ర‌త్యేకాధికారి శ్రీ‌మ‌తి విజ‌య‌ల‌క్ష్మి, ఎస్వే సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ సుధాకర్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.