ELABORATE ARRANGEMENTS FOR KARTIKA DEEPOTSAVAM FETE – TTD JEO (E&H) _ కార్తీక దీపోత్సవాల విజయవంతానికి ముమ్మర ఏర్పాట్లు – టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి

Tirupati, 29 October 2022: TTD JEO (E&H) Smt Sada Bhargavi directed TTD officials to make elaborate arrangements for the successful conduct of Karthika Deepotsavam at Yaganti on November 7, at Visakhapatnam on November 14 and at Tirupati on November 18.

 

Addressing a review meeting at the TTD Administrative Building on Saturday the JEO said DyEOs of above temples should make preparations for distribution of Srivari laddus and Tiruchanoor Ammavari laddu prasadams at Deepotsavam locations.

 

Among others, she instructed that DFO should keep Tulasi plants ready and Principals of SV College of Music and Dance should gear up with cultural items and Director of Annamacharya project to prepare Sankeetan teams.

 

She also asked TTD printing press officials to prepare handbills on the significance of Karthika masam and Do’s and Don’ts list for devotees.

 

She asked TTD PRO to deploy adequate number of Srivari Sevaks and also provide sufficient publicity for the fete.

 

The JEO also directed the CE to set up platforms and barricades etc, VGO to coordinate with local police on security and parking facilities, MO to deploy doctors and paramedics, health officer to coordinate with local officials on garbage clearance etc., Transport GM to organise vehicles.

 

Tirumala Srivari temple chief Archaka Sri Venugopala Deekshitulu, SVBC CEO Sri Shanmukh Kumar and CE Sri Nageswara Rao were present.

 

JEO inspects Children’s hospital works 

 

JEO Smt Sada Bhargavi along with officials inspected the ongoing development works at the Sri Padmavati Children’s super speciality hospital on Saturday evening.

 

She directed officials and contractors to complete the civil and other works on schedule by hiring additional manpower if necessary.

 

She instructed the engineering officials to review progress of hospital works on a daily basis.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

కార్తీక దీపోత్సవాల విజయవంతానికి ముమ్మర ఏర్పాట్లు – టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి

తిరుపతి 29 అక్టోబరు 2022: నవంబరు 7న యాగంటి, 14న విశాఖపట్నం, 18న తిరుపతిలో నిర్వహించే కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు విజయవంతం చేయడానికి సమష్టిగా ఏర్పాట్లు ముమ్మరం చేయాలని టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి అధికారులకు పిలుపునిచ్చారు.

టీటీడీ పరిపాలన భవనంలో శనివారం ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి లడ్డూ ప్రసాదాలను అందుబాటులో ఉంచడానికి ఆలయాల డిప్యూటీ ఈవో లు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. డిఎఫ్ఓ తులసి మొక్కలు, సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్ లక్షీ అమ్మవారి నృత్య ప్రదర్శనల కోసం కళాబృందాలు సిద్ధం చేయాలన్నారు. అన్నమాచార్య ప్రాజెక్ట్ నుంచి తగినంతమంది గాయకులను కార్తీక దీపోత్సవాలకు పంపడానికి డైరెక్టర్ చర్యలు తీసుకోవాలని చెప్పారు. కార్తీక మాసం విశిష్టత, భక్తులు చేయాల్సిన, చేయకూడని పనులు తెలిపే కరపత్రాలు ప్రెస్ ప్రత్యేకాధికారి సిద్ధం చేయాలని జేఈవో అన్నారు. పిఆర్వో తగినంత మంది శ్రీవారి సేవకులను ఏర్పాటు చేసి, పబ్లిసిటీ కోసం తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. చీఫ్ ఇంజినీర్ స్టేజీ, బారికేడ్లు, ఇతర ఇంజనీర్ ఏర్పాట్ల పనులు ముందుగానే చేపట్టాలని ఆమె సూచించారు. విజివో స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని భద్రత, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. సీఎంవో తగినంతమంది డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బందిని నియమించాలన్నారు. అదనపు ఆరోగ్యాధికారి స్థానిక అధికారులతో సంప్రదించి పారిశుధ్య నిర్వహణ ఏర్పాట్లు చేయాలని జేఈవో చెప్పారు. రవాణా విభాగం జిఎం తగినన్ని వాహనాలు సమకూర్చుకోవడానికి ముందుగానే ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు.

తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముక్ కుమార్, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల పరిశీలన అనంతరం జేఈవో శ్రీమతి సదా భార్గవి అధికారులతో కలసి చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. మ్యాన్ పవర్ ఎక్కువ ఏర్పాటు చేసుకుని నిర్ణీత సమయంలోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థ అధికారులను ఆదేశించారు. టీటీడీ ఇంజినీరింగ్ ఇతర సంబంధిత శాఖాధిపతులు నిర్మాణ పనుల ప్రగతిని రోజువారీగా సమీక్షించుకోవాలని జేఈవో సూచించారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.