GAJA VAHANA SEVA PERFORMED _ గజ వాహనంపై శ్రీమన్నారాయణుడు కనువిందు

TIRUPATI, 16 FEBRUARY 2023: As part of the ongoing annual brahmotsavams in Srinivasa Mangapuram, Gaja Vahana Seva was observed on the sixth day evening on Thursday.

Sri Kalyana Venkateswara in all His celestial splendour blessed devotees all along the mada streets on the mighty Gaja Vahanam amidst the grandeur of paraphernalia.

Special Gr DyEO Smt Varalakshmi, AEO Sri Gurumurthy and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

గజ వాహనంపై శ్రీమన్నారాయణుడు కనువిందు

తిరుప‌తి, 2023 ఫిబ్ర‌వ‌రి 16: శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు గురువారం రాత్రి 7 నుండి 8 గంటల వరకు శ్రీమన్నారాయణుడు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

గజ వాహనం – క‌ర్మ విముక్తి

నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయి. మంగళకరమైన గజరాజుకు అతిశయమైన మంగళత్వం కలిగించేందుకు శ్రీవారు ఆరో రోజు తన సార్వభౌమత్వాన్ని భక్తులకు తెలిపేందుకు గజవాహనంపై ఊరేగుతారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్ శ్రీ చెంగ‌ల్రాయులు, కంకణభట్టర్‌ శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.