GOVINDARAJA SHINES ON GARUDA VAHANA _ గరుడ వాహనంపై శ్రీ గోవిందరాజస్వామివారి కటాక్షం
Tirupati, 22 May 2021: On Saturday evening, during the ongoing annual Brahmotsavams of Sri Govindaraja Swamy temple, the deity decked in all His divine splendour blessed devotees on Garuda vahanam held in Ekantam due to Covid guidelines.
Garuda vahana Seva is most significant among all vahana sevas and devotees believe that Darshan of Garuda Vahana Seva of Swamy will ward off all sins and bring good dividends.
Tirumala pontiffs Sri Sri Sri Pedda Jeeyar Swamy and Sri Sri Sri Chinna Jeeyar Swamy, Special Grade DyEO Sri Rajendrudu and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
గరుడ వాహనంపై శ్రీ గోవిందరాజస్వామివారి కటాక్షం
తిరుపతి, 2021 మే 22: తిరుపతి శ్రీగోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజైన శనివారం సాయంత్రం విశేషమైన గరుడ వాహనంపై శ్రీ గోవిందరాజస్వామివారు కటాక్షించారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా వాహన సేవ నిర్వహించారు.
స్వామివారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు. గరుత్మంతుని రెక్కలు వేదం నిత్యత్వానికి, అపౌరుషషేయత్వానికి ప్రతీకలని స్తుతించారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. జ్ఞాన, వైరాగ్య ప్రాప్తిని కోరే మానవులు జ్ఞాన, వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగవదధిష్ఠుతుడైన గరుడుని దర్శించి అభీష్ఠసిద్ధి పొందుతారు. ఇందుకే గరుడసేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం విశిష్టత ఏర్పడ్డాయి.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ రవికుమార్ రెడ్డి, కంకణ బట్టార్ శ్రీ ఏ.టి. పార్థసారధి దీక్షితులు, సూపరింటెండెంట్ శ్రీ వెంకటాద్రి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ మునీంద్రబాబు, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.