చంద్రగిరి శ్రీ మూలస్థాన యల్లమ్మకు శ్రీవారి ఆలయం నుండి సారె

చంద్రగిరి శ్రీ మూలస్థాన యల్లమ్మకు శ్రీవారి ఆలయం నుండి సారె
 
తిరుపతి, జనవరి-16,2013:చంద్రగిరి శ్రీ మూలస్థాన యల్లమ్మకు బుధవారం శ్రీవారి ఆలయం నుండి తీసుకు వచ్చిన సారెను తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.యస్‌ శ్రీనివాస రాజు బహుకరించారు.
 
ప్రతి సంవత్సరం సంక్రాంతి అయిన రెండవ రోజు శ్రీ మూలస్థాన యల్లమ్మకు కొండచుట్టు ఉత్సవం చేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఆ పర్వదినాని పురష్కరించుకొని కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీవెంకటేశ్వర స్వామివారి చెల్లలు చంద్రగిరి శ్రీ మూలస్థాన యల్లమ్మకు గత మూడు సంవత్సరాలుగా సారె బహుకరించడం ఆనవాయితీగా వస్తున్నది.
 
ఈ కార్యక్రమంలో  రాష్ట్ర గనుల శాఖా మంత్రివర్యులు శ్రీమతి గల్లా అరుణ కుమారి,ఇతర అధికారులు మరియు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.