చంద్రగ్రహణం సందర్భంగా తితిదే స్థానిక ఆలయాల మూత

చంద్రగ్రహణం సందర్భంగా తితిదే స్థానిక ఆలయాల మూత

 తిరుపతి, ఏప్రిల్‌  24, 2013: ఏప్రిల్‌ 25వ తేదీ గురువారం చంద్రగ్రహణం సందర్భంగా తితిదే స్థానిక ఆలయాలను సాయంత్రం మూసివేయనున్నారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తలుపులను సాయంత్రం 6.00 గంటలకు మూసివేస్తారు. తిరిగి మరుసటి రోజైన శుక్రవారం తెల్లవారుజామున 3.00 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు. అనంతరం ఆలయాన్ని శుద్ధిచేసి పుణ్యహవచనం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుండి భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. మధ్యాహ్నం 2.30 నుండి 3.30 గంటల వరకు ఫ్రైడే గార్డెన్స్‌లో అమ్మవారికి అభిషేకం చేస్తారు. సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారు. అదేవిధంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో చంద్రగ్రహణం సందర్భంగా గురువారం సాయంత్రం 5.00 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. మరుసటి రోజైన శుక్రవారం తెల్లవారుజామున 3.00 గంటలకు ఆలయ తలపులు తెరిచి శుద్ధి కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.