TTD JEO (H&E) INSPECTIONS AT OLD HUZUR OFFICE COMPLEX _ చారిత్రక భవనంగా పాత హుజూర్ ఆఫీసు భవనాలు- అభివృద్ధి కి ప్రణాళికలు సిద్ధం చేయాలని జె ఈవో శ్రీమతి సదా భార్గవి ఆదేశం
DIRECTS ACTION PLAN FOR DEVELOPMENT ACTIVITIES
Tirupati,13 October 2022: TTD JEO(H & E) Smt Sada Bhargavi on Thursday said the old huzur office complex of TTD needs to be recognized as a heritage building.
After conducting an inspection of the old complex and the museum behind Sri Govindaraja Swamy temple the TTD JEO directed engineering officials to prepare an action plan to develop the old huzur office complex into a platform for music and dance college.
She wanted the museum to showcase the sculpture arts of the sculpture college.
Chief audit officer Sri Sesha Shailendra, DEO Sri Govindarajan, SE (electrical) Sri Venkateswarlu, Revenue AEO Sri Muniratnam, Principal of SV College of Music and Dance Sri Sudhakar and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
చారిత్రక భవనంగా పాత హుజూర్ ఆఫీసు భవనాలు
– అభివృద్ధి కి ప్రణాళికలు సిద్ధం చేయాలని జె ఈవో శ్రీమతి సదా భార్గవి ఆదేశం
తిరుపతి 13 ఆక్టోబరు 2022: వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న టీటీడీ పాత హుజూర్ ఆఫీసు భవనాలను చారిత్రక కట్టడాలుగా పరిగణించాల్సిన అవసరం ఉందని టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి అన్నారు.
శ్రీ గోవింద రాజస్వామి ఆలయం వెనుక వైపున గల పాత హుజూర్ ఆఫీసుతో పాటు, మ్యూజియం ను గురువారం సాయంత్రం ఆమె పరిశీలించారు.
వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న పాత హుజూర్ ఆఫీసు భవనాలను సంరక్షించి సంగీత, నృత్య కళాశాలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేసేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆమె ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే మ్యూజియం భవనంలో శిల్ప కళాశాలకు చెందిన పురాతన శిల్పాలు, ఇతర చారిత్రక శిల్పాలు ఉంచేందుకు అవసరమైన విధంగా మరమ్మతులు చేయాలన్నారు.
చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శ్రీ శేష శైలేంద్ర, డిఈవో శ్రీ గోవింద రాజన్, విద్యుత్ విభాగం
ఎస్ ఈ శ్రీ వెంకటేశ్వర్లు, రెవెన్యూ ఎఈవో శ్రీ మునిరత్నం, సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ సుధాకర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది