START FEED MIXING PLANT FROM JANUARY AT SV GOSAMRAKSHANASHALA- TTD EO _ జ‌న‌వ‌రి నుంచి ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్‌లో ఉత్ప‌త్తి ప్రారంభించాలి : టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

Tirupati, 07 September 2022:  TTD EO Sri AV Dharma Reddy has directed officials to ensure completion of the feed mixing plant works at SV Gosamrakshanashala by December and begin production from January 2023 onwards.

 

He addressed a review meeting at Sri Padmavati rest house on Wednesday evening with officials of the SV veterinary university.

 

Officials informed the TTD EO that works on sheds and equipment mobilisation etc. will be completed by December.

 

The EO instructed University officials to get ready with and technical staff and technical inputs by January.

 

Among others, he advised officials to keep stock of raw materials by  October end.

 

In the joint operation of SVV university and New tech biosciences of US, the feed is to be used by TTD and the university and an action plan be prepared for use of surplus if any, to be utilised through Rythu Bharosa centres on no profit basis to farmers benefit.

 

TTD JEO Smt Sada Bhargavi, Sri Veerabrahmam, FA &CAO Sri Balaji, CE Sri Nageswara Rao, SV Goshala Director Dr Harnath  Reddy, Veterinary University extension wing director Dr Venkata Naidu, Research wing Director Dr Sarwan Rao were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జ‌న‌వ‌రి నుంచి ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్‌లో ఉత్ప‌త్తి ప్రారంభించాలి : టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుప‌తి, 2022 సెప్టెంబ‌రు 07: ఎస్వీ గోసంర‌క్ష‌ణ‌శాలలో నిర్మిస్తున్న ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ ప‌నులు డిసెంబ‌రు నాటికి పూర్తి చేసి జ‌న‌వ‌రి నుంచి ఉత్ప‌త్తి ప్రారంభించ‌డానికి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తి శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహంలో బుధ‌వారం సాయంత్రం ఆయ‌న టిటిడి, ఎస్వీ ప‌శువైద్య విశ్వ‌విద్యాల‌యం అధికారుల‌తో ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ నిర్మాణ‌ప‌నుల ప్ర‌గ‌తిపై స‌మీక్షించారు.

ప్లాంట్ షెడ్ల నిర్మాణం దాదాపు పూర్త‌యింద‌ని, యంత్రాల స‌మీక‌ర‌ణ‌, వాటి ఏర్పాటు ప‌నులు డిసెంబ‌రుకు పూర్తి చేస్తామ‌ని అధికారులు చెప్పారు. జ‌న‌వ‌రి నుంచి ఉత్ప‌త్తి ప్రారంభించ‌డానికి అవ‌స‌ర‌మైన సాంకేతిక ప‌రిజ్ఞానం, సిబ్బందిని సిద్ధం చేసుకోవాల‌ని వ‌ర్సిటీ అధికారుల‌కు ఈవో సూచించారు. ఫీడ్ త‌యారీకి అవ‌స‌ర‌మైన ముడిస‌రుకును అక్టోబ‌రు చివ‌రి నాటికే సిద్ధం చేసుకోవాల‌న్నారు. ప‌శువైద్య వ‌ర్సిటీ, అమెరికాకు చెందిన న్యూటెక్ బ‌యోసైన్సెస్ సంయుక్త నిర్వ‌హ‌ణ‌లో త‌యార‌య్యే ఫీడ్‌ను ఎస్వీ గోసంర‌క్ష‌ణ‌శాల, వ‌ర్సిటీ అవ‌స‌రాల‌కు వినియోగించ‌గా, మిగిలిన‌ది లాభాపేక్ష లేనిధ‌ర‌తో రైతు భ‌రోసా కేంద్రాల ద్వారా విక్ర‌యించేందుకు త‌గిన ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని ఈవో సూచించారు.

జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివి ఎస్వో శ్రీ నరసింహ కిషోర్ ఎఫ్ఏసిఏవో శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, గోశాల సంచాల‌కులు డాక్ట‌ర్ హ‌ర‌నాథ‌రెడ్డి, వ‌ర్సిటీ విస్త‌ర‌ణ విభాగం సంచాల‌కులు డాక్ట‌ర్ వెంక‌ట‌నాయుడు, ప‌రిశోధ‌న విభాగం సంచాల‌కులు డాక్ట‌ర్ స‌ర్జ‌న్‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.